HOME »NEWS »ANDHRA PRADESH »on ys rajasekhara reddy 71 birth anniversary ap cm jagan pays tribute to him in idupulapaya nk

వైఎస్‌ఆర్ మరణం లేని నేత... తండ్రి సేవల్ని గుర్తుచేసుకున్న సీఎం జగన్

వైఎస్‌ఆర్ మరణం లేని నేత... తండ్రి సేవల్ని గుర్తుచేసుకున్న సీఎం జగన్
వైఎస్‌ఆర్ మరణం లేని నేత... తండ్రి సేవల్ని గుర్తుచేసుకున్న సీఎం జగన్

నేడు YSR 71వ జయంతి సందర్భంగా... ఇడుపులపాయలో ఘన నివాళి అర్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్... తండ్రి చేసిన సేవా కార్యక్రమాల్ని గుర్తుచేసుకున్నారు.

  • Share this:
    వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో దివంగత నేతకు ఘన నివాళి అర్పించారు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి. ఆయనతో పాటు తల్లి విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులు కూడా వెంట ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తర్వాత కొన్ని అభివృద్ధి పాల్గొనే జగన్‌ ప్రారంభోత్సవాలు, భూమిపూజలు చేయనున్నారు. ట్రిపుల్‌ ఐటీలో నిర్మించిన వివిధ ఇంజినీరింగ్‌ విభాగాలతో పాటు మూడు మెగావాట్ల సౌర విద్యుత్తు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆడిటోరియం, కంప్యూటర్‌ సెంటర్లకు భూమి పూజ చేసి శిలా ఫలకాలు ఆవిష్కరిస్తారు. వీటితోపాటు క్యాంపస్‌లోని వైఎస్సార్‌ సర్కిల్‌లో ఏర్పాటుచేసిన వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.




    మహానేత వైఎస్‌ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి. వైఎస్‌ఆర్ 71 వ జయంతి సందర్భంగా జగన్ ప్రత్యేక ట్వీట్ చేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి పథకాల రూపంలో మహానేత ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారని అన్నారు. రాజశేఖరరెడ్డి మరణం లేని నేత అన్నారు సీఎం జగన్.
    Published by:Krishna Kumar N
    First published:July 08, 2020, 13:00 IST