హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Sports University: కరణం మల్లేశ్వరికి క్రేజీ ఆఫర్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా ఎంపిక చేసిన కేజ్రీవాల్

Sports University: కరణం మల్లేశ్వరికి క్రేజీ ఆఫర్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా ఎంపిక చేసిన కేజ్రీవాల్

karnam malleshwari

karnam malleshwari

తెలుగు క్రీడా ఆణిముత్యం కరణం మల్లేశ్వరికి ఇంతకాలనికి కాస్త గుర్తింపు దక్కింది. క్రీడా యూనిర్శిటికీ తొలి వీసీగా నియమిస్తూ ఆప్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

  తెలుగు జాతి గర్వపడేలా చేసిన క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి.. అసాధ్యం అనుకున్న సమయంలో ఒలింపిక్ మెడల్ గెలిచి భారత దేశ జెండాను రెపరెపలాడించింది. అయితే ఆ రోజుల్లో ఆమె దేశానికి చేసిన సేవలకు మాత్రం సరైన గుర్తింపు రాలేదు. ఆ పతకం సాధించడానికి ఆమె పడ్డ కష్టాలు ఎన్నో అన్నింటినీ దాటి భారత దేశ గౌరవాన్ని కాపాడింది. ఇన్నాళ్లకు ఆమె ప్రతిభకు సరైన గుర్తింపు దక్కింది. ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల దేశరాజధాని ఢిల్లీలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వెయిట్ లిఫ్టర్, ఒలింపిక్ మెడల్ విన్నర్, పద్మశ్రీ కరణం మల్లీశ్వరిని నియమిస్తూ.. ఆప్ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. ఈ మేరకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రీడా విశ్వవిద్యాలయానికి కరణం మల్లీశ్వరి మొట్టమొదటి వీసీ అవుతారని ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది. త్వరలోనే ఈ నియామకానికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయనున్నారు.

  ఇటీవల డిప్యూటీ సీఎం మనీశ్ సిపోడియా.. స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి పలు విషయాలను వెల్లడించారు. క్రీడాకారులు ఇకపై తాము ఎంచుకున్న క్రీడాంశంలో డిగ్రీ పొందవచ్చని మనీశ్ సిసోడియా తెలిపారు. క్రీడాకారులు ఇతరత్రా డిగ్రీ చేయాల్సిన అవసరం లేదని.. నేరుగా క్రీడా సబ్జెక్టుల్లోనే డిగ్రీ చేయవచ్చని పేర్కొన్నారు. క్రీడలను ప్రోత్సహించడానికి తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

  ఇదీ చదవండి: ఈ చిన్నారి తల్లి ఏం పాపం చేసింది.. ఊహ కూడా తెలియకముందే ఇంత నరకమా..?

  ఒలింపిక్ క్రీడల్లో దేశానికి కనీసం 50 వరకు పసిడి పతకాలు తెచ్చేలా క్రీడాకారులను తీర్చిదిద్దడమే ఈ వర్సిటీ ఏర్పాటు వెనుకున్న ముఖ్య లక్ష్యమని వివరించారు. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ క్రీడారంగంలో దేశాన్ని గర్వించేలా చేస్తుందన్న నమ్మకం ఉందని స్పష్టం చేశారు. డిగ్రీ స్థాయి నుంచి పీహెచ్ డీ వరకు వివిధ క్రీడాంశాల్లో వర్సిటీ కోర్సులను అందిస్తుందని తెలిపారు.

  ఇదీ చదవండి: సిక్స్ కొట్టాడు.. కానీ తల పట్టుకుని ఫీలయ్యాడు.. ఎందుకో తెలుసా.. వీడియో చూడండి

  శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం ఊసవానిపేటకు చెందిన మల్లీశ్వరి 2000లో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించారు. ఆ రోజుల్లో ఒలింపిక్స్ లో భారత్ నుంచి పోటీ పడడమే గొప్ప అనేలా పరిస్థితి ఉండేది. అలాంటి సమయంలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పతకం సాధించింది కరణం మల్లేశ్వరి.. అందుకే ఆమెలాంటి మరెందరో జాతీ రత్నాలను తయారు చేయాలనే ఉద్దేశంతో ఆమెకు కీలక పదవి అప్పచెప్పింది ఆప్ ప్రభుత్వం..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: AAP, Aravind Kejriwal, Delhi, Sports, Srikakulam

  ఉత్తమ కథలు