హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Aadhar Card: ఓ బామ్మ కొంప ముంచిన ఆధార్ కార్డు.. అసలేం జరిగిదంటే..?

Aadhar Card: ఓ బామ్మ కొంప ముంచిన ఆధార్ కార్డు.. అసలేం జరిగిదంటే..?

ఆధార్ మిస్టేక్ తో నిలిచిన పెన్షన్

ఆధార్ మిస్టేక్ తో నిలిచిన పెన్షన్

just 16 years: 20 ఏళ్లుగా వస్తున్న పెన్షన్ సడెన్ గా ఆపేశారు అధికారులు. దీంతో తనకు పెన్షన్ ఎందుకు రాలేదు అంటూ ఆ బామ్మ అధికారులను ప్రశ్నించింది. అయితే వారు చెప్పిన సమాధానం విని.. బామ్మకు మైండ్ బ్లాంక్ అయ్యింది.

GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

Aadhar Card:  ఒంటరిగా జీవిస్తున్న వృద్దులకు ఆ నాటి నుంచి నేటి వరకు.. పెన్షన్ ఆధారంగా కాలం నెట్టుకొస్తోంది.  తమకు కావలసిన మాత్రలు, ఇతర నిత్యావసర వస్తువులు పెన్షన్ సొమ్ముతోనే కొనుగోలు చేస్తూ.... తమ ఆకలి సైతం తీర్చుకుంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ ఇతర పథకాలపై ప్రభుత్వం ఆడిట్ జరుపుతోంది.  దీంతో చాల వరకు రేషన్ కార్డులతో పాటు.. పలు సంక్షేమ పథకాలను లబ్ధి దారులు కోల్పోవలసి వస్తోంది. ఇలా వాటిని కోల్పోతున్న వారిలో పేదలు కూడా ఉన్నారు. ప్రభుత్వ పథకాలు ఇతరేతర కారణాలవల్ల కోల్పోయిన వారి గురించి రోజూ వింటూంటాం.. అయితే  ఆ బామ్మది మాత్రం వింత పరిస్థితి. ఎవరో చేసిన తప్పిదం కారణంగా నిరక్ష్యరాలైన ఆ బామ్మా పెన్షన్ ను అర్ధతరంగా నిలిపేశారు ప్రభుత్వ అధికారులు. గ్రామా సచివాలయం చుట్టూ తిరిగిన ఆ బామ్మకు దిమ్మ తిరిగే విషయాన్ని తెలిపారు గ్రామ సచివాలయ ఉద్యోగులు.

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో స్థానిక గాంధీ చౌక్ ఏరియాలో షేక్ అమీనా భి గత 50 సంవత్సారాల నుంచి అదే ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు.  ఆమె భర్త 30 సంవత్సారాలు క్రితమే మరణించాడు. దింతో ఉన్న కాస్త నగదు.. సంపాదన అంతా ఊడ్చి తన ఒక్కగానొక్క కుమార్తెకి పెళ్ళి చేసేసింది షేక్ అమీషా బీ. అప్పటి నుంచి గత 20 ఏళ్లుగా పెన్షన్ ఆధారంగా బతుకుతోంది.

మొదట 200 రూపాయల పించెన్ నుంచి టీడీపీ హయాంలో పెంచిన 2000 ఆపై వైసీపీ  ప్రభుత్వం లో 2,250 రూపాయల పెన్షన్ తీసుకోని జీవనం సాగిస్తూ వస్తోంది. గత రెండు నెలలుగా  ఉన్నట్టుండి భామ్మకు రావాల్సిన పెన్షన్ ను అధికారులు రద్దు చేసారు.


ఎందుకు తొలగించారో తెలుసుకోవాలని బామ్మ ప్రయత్నించింది. తన జీవనాధారంగా ఉన్న పెన్షన్ ను ఎందుకు అపరో చెప్పాలని అక్కడ సిబ్బందిని ప్రశ్నించింది. తొలగింపుకు అధికారుల. చెప్పిన  సమాధానం చూసి ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది.  ప్రస్తుతం ఆ బామ్మ వయసు 16 ఏళ్ళేనట.. ఇది ప్రభుత్వ రికార్డుల్లోనే కాదు.... ఆమె ఆధార్ కార్డులోను 16 ఏళ్ళ వయస్సు మాత్రమే ఉంది.

ఆ భామ వయస్సు 16 అని ఆధార్ కార్డు లోను ఉంది. అయితే ఆమె వయస్సు ఆధార్ కార్డులో తప్పుగా నమోదు కావడంతో తానేం చేయాలో తెలియన ఆవేదన వ్యక్తం చేసింది.  అధికారులు చెప్పిన సమాధానంతో కంగుతిన్న బామ్మ  ఈ వయస్సు లో తనకు ఇదేం ఖర్మ బాబు అంటూ ఆవేదనకు గురైంది.

గత 20 సంవత్సారాల నుంచి పెన్షన్ అందుకున్న తనకు ఇప్పుడు వయస్సు ప్రామాణికం తో పెన్షన్ తొలగించడం అన్యాయం అని అధికారులను వేడుకుంది. అయితే వారు మాత్రం వయసు మార్చుకోవాలని సూచించారని బామ్మ చెబుతోంది. అయితే వయసు మార్చుకునేందుకు ఆధారాలు ఆడుగుతుండడంతో ఆమెకు ఏం చేయాలో తెలియక.. అధికారుల చుట్టూ తిరుగుతోంది. అయితే  స్పందన కనిపించడం లేదని కన్నీరు పెట్టుకుటోంది.  కూడా కరువు అయ్యిందని షేక్ అమీనా భి తెలిపింది.

First published:

Tags: AADHAR, Andhra Pradesh, AP News

ఉత్తమ కథలు