ఉల్లిపాయల పోరాటంలో ప్రాణాలు విడిచిన వృద్ధుడు

Andhra Pradesh : ఇంతకంటే విచారకరం ఇంకొకటి ఉండదేమో. ఉల్లిపాయల కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోవడమేంటి... ఉల్లి కొరతతో ఇలాంటి దారుణ పరిస్థితులు తయారవుతున్నాయి.

news18-telugu
Updated: December 9, 2019, 11:24 AM IST
ఉల్లిపాయల పోరాటంలో ప్రాణాలు విడిచిన వృద్ధుడు
ఉల్లిపాయల పోరాటంలో ప్రాణాలు విడిచిన వృద్ధుడు
  • Share this:
Andhra Pradesh : దేశమంతా ఉల్లిపాయల కోసం క్యూలైన్లలో యుద్ధాలు, పోరాటాలు జరుగుతున్నాయి. ఈ పోరులో చాలా మంది గాయాలపాలవుతున్నారు. బీపీలూ, షుగర్లూ పెరుగుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడలోని రైతు బజార్‌లో సాంబయ్య (55) ఏకంగా ప్రాణాలే విడిచాడు. ఉదయం ఇంటి నుంచీ బయలుదేరిన సాంబయ్య... ఉల్లిపాయల కోసం క్యూ లైన్‌లో నిల్చున్నాడు. రోజూ లాగే... అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మాకు కావాలంటే, మాకు కావాలి అంటూ ప్రజలు ఉల్లి కోసం చిన్నపాటి యుద్ధం చేశారు. ఇదంతా చూసి ఒక్కసారిగా సాంబయ్యలో ఆందోళన పెరిగిపోయింది. టెన్షన్ వచ్చేసింది. అది ఏకంగా గుండె పోటుకు దారితీసింది. అమ్మో... అమ్మో అంటూ కింద పడిపోయాడు. షాకైన స్థానికులు... అయ్యో ఏమైంది... ఏమైంది... పెద్దాయనకు నీళ్లు పట్టించారు. అంతలోనే ఎవరో 108కి కాల్ చేశారు. గబగబా ఆయన్ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఐతే... ఆస్పత్రికి తీసుకెళ్లాక నాడి చెక్ చేసిన డాక్టర్లు... దారిలోనే సాంబయ్య చనిపోయినట్లు చెప్పారు. సాంబయ్య కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రమయ్యారు. ఉల్లిపాయల కోసం ప్రాణాలు విడవడం అందర్నీ కలచివేసింది.

ప్రస్తుతం విదేశీ ఉల్లిపాయలు... ఇవాళ హైదరాబాద్‌కి వస్తున్నాయి. అవి తెలుగు రాష్ట్రాలకు పూర్తిగా చేరడానికి మరో రోజు పట్టొచ్చు. అయినప్పటికీ కొరత మాత్రం తగ్గే అవకాశాలు లేవు. ప్రస్తుతం కేజీ ఉల్లి ఢిల్లీ లాంటి చోట్ల రూ.200 పలుకుతోంది. హైదరాబాద్‌లో కూడా చికెన్ కంటే ఉల్లిపాయల రేట్లే ఎక్కువగా ఉన్నాయి. కేజీ రూ.200 పలుకుతున్నాయి. ఏపీలో ప్రభుత్వం సబ్సిడీ ధరకింద కేజీ రూ.25కి ఇస్తోంది. దాంతో ఉల్లిపాయల కోసం పెద్ద ఎత్తున ప్రజలు క్యూలు కడుతున్నారు.

 

Pics: జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ క్యూట్ స్టిల్స్


ఇవి కూడా చదవండి :

డెలివరీ బాయ్స్ కోసం ఫ్రీ ఫుడ్, కూల్‌డ్రింక్స్... వైరల్ వీడియోకొత్త అవతారం ఎత్తిన అర్ణబ్ గోస్వామి... ఇక ఆపలేంగా...

ఒకేసారి రెండు సెక్స్ రాకెట్ల గుట్టు రట్టు...

సానియా మీర్జా సంచలనం... దుమ్మురేపుతున్న వైరల్ వీడియో

అత్యంత రద్దీగా శబరిమల... దర్శనానికి స్వాముల పడిగాపులు..

First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>