హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Gold Coins: మట్టిలో బంగారు నాణేలు... వాటి కోసం ఎగబడిన జనం... చివర్లో షాకింగ్ దృశ్యం

Gold Coins: మట్టిలో బంగారు నాణేలు... వాటి కోసం ఎగబడిన జనం... చివర్లో షాకింగ్ దృశ్యం

Gold Coins: మట్టిలో బంగారు నాణేలు?... వాటి కోసం ఎగబడిన జనం... చివర్లో షాకింగ్ దృశ్యం (File)

Gold Coins: మట్టిలో బంగారు నాణేలు?... వాటి కోసం ఎగబడిన జనం... చివర్లో షాకింగ్ దృశ్యం (File)

Gold Coins in Clay: బంగారు నాణేలు దొరుకుతున్నాయంటే... ఎవరికైనా వాటిని సొంతం చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది. అసలే కరోనా కాలం కావడంతో... అక్కడి పేద ప్రజలు వాటి కోసం కలబడుతున్నారు.

Gold Coins in AP and TN: ఆంధ్రప్రదేశ్‌ - తమిళనాడు సరిహద్దుల్లో బంగారు నాణేలు దొరుకుతున్నాయన్న విషయం తీవ్ర కలకలం రేపింది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరులో మట్టిదిబ్బల కింద బంగారు నాణేలు బయటపడుతున్నాయని తెలిసి... వాటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ప్రజలు నిన్న భారీగా తరలివచ్చారు. నిన్న చాలా మందికి నాణేలు దొరికాయి. వాళ్లు వాటిని పట్టుకుపోయారు. ఇవాళ కూడా అదే పరిస్థితి. బంగారు నాణేలు ఉన్నాయన్న సమాచారంతో... స్థానికులు, చుట్టుపక్కల జనాలు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. ఏపీ సరిహద్దు గ్రామాల నుంచి కూడా జనం భారీ సంఖ్యలో వెళ్తున్నారు. ఇక నాణేలు దొరికిన చోటైతే... మినీ యుద్ధమే జరుగుతోంది. నాణేల కోసం తోపులాటలు, ముష్టి యుద్ధాలకు దిగుతున్నారు. ఒక్కటి కనిపించినా చాలు... నాది నాది... నేను ముందు చూశాను, నేను ముందు ముట్టుకున్నాను అంటూ... కొట్టుకుంటున్నారు.

ఒక్కో నాణెం రెండు గ్రాములకు పైగా బరువు ఉంటుందని అంచనా వేస్తున్నారు హోసూరు పోలీసులు. వాటిపై అరబిక్ భాషలో లిపి ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... అందర్నీ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు పోలీసులు తరుముతున్నా... ప్రజలు మాత్రం ఆశతో వాటి కోసం మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తున్నారు.

ఎలా వచ్చాయి?

హోసూరు... సజ్జాపురం రోడ్డులోని పోలీసు క్వార్టర్స్‌ సమీపంలోని ఓ పొదలో ఉన్న మట్టి దిబ్బల్లో బంగారు నాణేలు దొరుకుతున్నాయని ప్రచారం జరిగింది. మట్టి దిబ్బల్లోకి ఆ నాణేలు ఎలా వచ్చాయన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో... రెండో రోజు కూడా హోసూరు-బాగలూర్ రోడ్డుపై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్‌ అయ్యింది.

తాజా ట్విస్ట్:

ప్రజల ఆశలపై అధికారులు నీళ్లు చల్లారు. అవి బంగారు నాణేలు కావనీ, ఇత్తడి నాణేలని తేల్చారు. నిన్న దొరికినవి కూడా ఇత్తడివేననీ... కానీ బంగారు నాణేలని ప్రచారం జరగడంతో... ఇంత పనైందని అధికారులు చెబుతున్నారు. అవి ఇత్తడివే అయినప్పటికీ పురాతన నాణేలు కాబట్టి... వాటికి బంగారానికి సమానమైన విలువ ఉంటుదని చరిత్రకారులు చెబుతున్నారు. అవి ఎంత పురాతనమైనవి అయితే... అంతలా వాటికి విలువ పెరుగుతుందంటున్నారు. ఏమైతేనేం... నాణేల అంశం ఇలా తీవ్ర కలకలం మాత్రం రేపుతోంది.

First published:

Tags: AP News, Tamil Film News

ఉత్తమ కథలు