హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Cinema Theatres: ఏపీలో పలు సినిమా థియేటర్లు సీజ్.. అధికారుల మెరుపుదాడులు.. కారణం ఇదే..

AP Cinema Theatres: ఏపీలో పలు సినిమా థియేటర్లు సీజ్.. అధికారుల మెరుపుదాడులు.. కారణం ఇదే..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఇటీవల సినిమా టికెట్ల ధరలను (Movie tickets price issue) సవరించిన సంగతి తెలిసిందే. ఐతే కొందరు థియేటర్ల యాజమానులు కోర్టుకు వెళ్లడంతో పాత పద్ధతిలోనే టికెట్లు విక్రయించాలని ధర్మాసనం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఇటీవల సినిమా టికెట్ల ధరలను (Movie tickets price issue) సవరించిన సంగతి తెలిసిందే. ఐతే కొందరు థియేటర్ల యాజమానులు కోర్టుకు వెళ్లడంతో పాత పద్ధతిలోనే టికెట్లు విక్రయించాలని ధర్మాసనం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఇటీవల సినిమా టికెట్ల ధరలను (Movie tickets price issue) సవరించిన సంగతి తెలిసిందే. ఐతే కొందరు థియేటర్ల యాజమానులు కోర్టుకు వెళ్లడంతో పాత పద్ధతిలోనే టికెట్లు విక్రయించాలని ధర్మాసనం తెలిపింది.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఇటీవల సినిమా టికెట్ల ధరలను (Movie tickets price issue) సవరించిన సంగతి తెలిసిందే. ఐతే కొందరు థియేటర్ల యాజమానులు కోర్టుకు వెళ్లడంతో పాత పద్ధతిలోనే టికెట్లు విక్రయించాలని ధర్మాసనం తెలిపింది. కానీ జాయింట్ కలెక్టర్ల అనుమతితోనే టికెట్ల రేట్లను పెంచుకోవచ్చనే నిబంధనను పెట్టింది. ఈ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న సినిమా థియేటర్లపై అధికారులు కొరడా ఝుళిపించారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో అధికారులు సినిమా థియేటర్లపై దాడులు నిర్వహించారు. రూల్స్ పాటించని వారిపై చర్యలు తీసుకున్నారు. కృష్ణాజిల్లా, విజయనగరం జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

  ముఖ్యంగా సినిమా థియేటర్లకు కేరాఫ్ అడ్రస్ అయిన విజయవాడ లోని పలు థియేటర్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అప్సర థియేటర్, పీవీఆర్, అలంకార్, అన్నపూర్ణ, శైలజ థియేటర్, క్యాపిటల్ సినిమాస్ తో పాటు మరికొన్ని థియేటర్లను తనిఖీలు చేసిన పోలీసులు టికెట్ల ధరల వివరాలను సేకరించడంతో పాటు పార్కింగ్ సౌకర్యాలను పరిశీలించారు. థియేట్లలోనే క్యాంటీన్లలో తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలుసుకున్నారు. నగరంలోని అన్ని థియేటర్లను పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి పంపుతామని పోలీసులు తెలిపారు.

  ఇది చదవండి: సీఎం జగన్ కు పవన్ కల్యాణ్ విషెస్.. పవర్ స్టార్ ఏమన్నారంటే..!


  ఇక విజయనగరం జిల్లాలోని పలుచోట్ల జూయింట్ కలెక్టర్ డాక్టర్ జీసీ కిషోర్ కుమార్ థియేటర్లను తనిఖీ చేశారు. మూడు సినిమా హాళ్ల‌ను మూసివేయాల‌ని తాశీల్దార్ల‌ను ఆదేశించారు. ఆయ‌న పూసపాటిరేగ‌, భోగాపురం, నెల్లిమర్ల మండ‌లాల్లో మంగ‌ళ‌వారం ఆక‌స్మికంగా ప‌ర్య‌టించి, సినిమా థియేట‌ర్ల‌ను త‌నిఖీ చేశారు. ముందుగా పూస‌పాటిరేగ సాయికృష్ణా థియేట‌ర్‌ను ప‌రిశీలించారు. ఈ థియేట‌ర్‌లో ఫైర్ సేఫ్టీ లైసెన్స్ 2015 నుంచి రెన్యువ‌ల్ చేయ‌క‌పోవ‌డాన్ని గుర్తించి, తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. థియేట‌ర్‌ను సీజ్ చేయాల‌ని తాశీల్దార్‌ను ఆదేశించారు.

  ఇది చదవండి: హోదాపై మరోసారి స్పందించిన కేంద్రం.. ఆ బకాయిలతో సంబంధం లేదని క్లారిటీ..


  భోగాపురం మండ‌లం గోపాల‌కృష్ణ థియేట‌ర్‌ను జేసి త‌నిఖీ చేశారు. సినిమా టిక్కెట్లను అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తున్న‌ట్లు గుర్తించారు. ఈ థియేట‌ర్‌ను కూడా సిజ్ చేయాల‌ని జెసి కిశోర్ ఆదేశించారు. నెల్లిమర్ల లోని ఎస్ త్రి సినిమాస్ థియేటర్ ను కూడా తనికీ చేశారు. టిక్కెట్లు అధిక ధరలకు విక్రయిస్తున్న ఈ సినిమా హాలును కూడా సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో మూడు థియేట‌ర్ల‌ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు.

  ఇది చదవండి: ఆ మంత్రికి ముందుగానే వరమిచ్చిన సీఎం జగన్..? ఐదేళ్లు పదవికి ఢోకా లేనట్లేనా..?


  ఇటీవల పుష్ప సినిమా విడుదల కావడమే కాకుండా త్వరలో శ్యాంసింగరాయ్, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, బంగార్రాజు వంటి పెద్ద సినిమాలు వస్తుండటంతో టికెట్ల ధరలపై ప్రభుత్వం దృష్టిసారించింది. అనుమతులు లేకుండా టికెట్ల ధరలు పెంచినా, ప్రేక్షకులకు సరైన సౌకర్యాలు కల్పించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హచ్చరించింది. బాలకృష్ణ అఖండ సినిమా రిలీజ్ అయిన సందర్భంగానూ బెనిఫిట్ షోలు వేసిన థియేటర్లను అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే..!

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  First published:

  Tags: Andhra Pradesh, Cinema, Theatres