Andhra Pradesh : ఉత్త‌రాంధ్ర‌కు "ఒడిశా కిక్కు".. అక్ర‌మంగా ఎన్‌డీపీఎల్ మ‌ద్యం విక్ర‌యాలు

(ప్రతీకాత్మక చిత్రం)

Andhra Pradesh : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఒడిశా (Odisha) నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మ‌ద్యం అక్ర‌మంగా స‌ర‌ఫ‌రా అవుతోంది. ఇటు పోలీసులు, అటు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు నిరంత‌రం మ‌ద్యం స‌ర‌ఫ‌రా క‌ట్ట‌డికి య‌త్నిస్తునే ఉన్నో ఎదో రూపంలో ర‌వాణా మాత్రం ఆగ‌డం లేదు.

  • Share this:
    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఒడిశా (Odisha) నుంచి విశాఖపట్నం, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలకు మ‌ద్యం అక్ర‌మంగా స‌ర‌ఫ‌రా అవుతోంది. ఇటు పోలీసులు, అటు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు నిరంత‌రం మ‌ద్యం స‌ర‌ఫ‌రా క‌ట్ట‌డికి య‌త్నిస్తునే ఉన్నో ఎదో రూపంలో ర‌వాణా మాత్రం ఆగ‌డం లేదు. ఇటీవల, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (Special Enforcement Bureau) అధికారులు ఒడిశాలో తయారు చేసిన 1,700 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలా మ‌ద్యం ర‌వాణా చేస్తున్న ప‌లువురిని విశాఖ‌ప‌ట్నంలో అరెస్టు కూడా చేశారు. ఈ ముఠా వివ‌రాల‌ను పోలీసులు ఆరా తీశారు. ఈ ముఠా విశాఖ‌ప‌ట్నంలోని KRM కాలనీలో నాన్-డ్యూటీ పేయిడ్ లిక్క‌ర్‌ (Non-duty Paid Liquor) ని నిల్వ చేసింద‌ని పోలీసులు గుర్తించారు. పోలీస్ బృందం ప‌రిశీల‌న‌లో ఒడిశాలోని బెర్హాంపూర్‌లో నుంచి ఎన్‌డిపిఎల్‌ను సేకరించినట్లు గుర్తించారు.

    మ‌ద్యం కొర‌తే ఆస‌రాగా..
    విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పూసపాటిరేగ మండల పరిధిలో ఒడిశా నుంచి తెచ్చిన ఎన్‌డీపీఎల్ (NDPL) మ‌ద్యాన్ని ప‌లువురు అమ్మ‌కాలు నిర్వ‌హించారు. పండుగ కావ‌డంతో జ‌నం కూడా కొంటున్నారు. ఇది గుర్తించిచ స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (Special Enforcement Bureau) బృందం వారిని అదుపులోకి తీసుకొంది.

    Andhra Pradesh : కృష్ణా ప్రాజెక్టులు బోర్డు ప‌రిధిలోకి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ నిర్ణ‌యం!


    ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర‌కు ప్రసిద్ధ బ్రాండ్ల బీర్లు, మద్యం కొరతను సద్వినియోగం చేసుకుని, కొన్ని ముఠాలు ఒడిశా నుంచి వివిధ బ్రాండ్‌లను సేకరించి రాష్ట్రంలో విక్రయించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి.

    వంద‌ల సంఖ్య‌లో సీసాలు స్వాధీనం..
    అధిక లాభార్జ‌న కోసం కొన్ని ముఠాలు ఒడిషా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఎన్‌డిపిఎల్‌ను రవాణా చేసి అమ్ముతున్నాయ‌ని సెబీ (SEB) అధికారులు చెబుతున్నారు. అరెస్టులు త‌నిఖీలు చేస్తున్నా.. ర‌వాణా కొన‌సాగిస్తున్నార‌ని పోలీసులు చెబుతున్నారు. వారానికి 100 నుంచి 150 ఒడిశాకు చెందిన మ‌ద్యం సీసాలు స్వాధీనం చేసుకొంటున్నామ‌ని సెబీ, పోలీసు అధికారులుచెబుతున్నారు. "మేము NDPL ను స్వాధీనం చేసుకోవడానికి, అక్రమ వ్యాపారంలో పాల్గొన్న సభ్యులను పట్టుకోవడానికి కొన్ని వ్యూహాత్మక ప్రదేశాలలో ఆకస్మిక తనిఖీలను పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము" అని SEB తో ఉన్న ఒక సీనియర్ అధికారి చెప్పారు.

    ప్ర‌భుత్వం మ‌ద్యం కొర‌త‌ను త‌గ్గించేందు ప‌లు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. ఆగ‌స్టులో చివ‌రి వారంలో విశాఖపట్నం(Visakhapatnam) లో మందు బాబులకు ఎక్సైజ్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇనాళ్లూ మద్యం కావాలంటే క్యూలైన్లో నుంచోని నచ్చిన బ్రాండ్ దొరకుతుందో లేదో అని టెన్షన్‌తో మద్యం ప్రియులు ఉండేవారు. ఇప్పుడు అలాంటి టెన్షన్ లేకుండా ప్రీమియం వాక్ ఇన్ స్టోర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్. సీతమ్మదార పుడ్‌ఎక్స్ దగ్గర, అప్పూగర్ దగ్గర ఏపీ టూరిజం హరిత రిసార్ట్స్‌లో ప్రయెగాత్మకంగా వీటిని ఏర్పాటు చేసారు. జిల్లా వ్యాప్తంగా 11 స్టోర్స్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
    Published by:Sharath Chandra
    First published: