Home /News /andhra-pradesh /

OBLIGATION TO DISRUPT PEACEKEEPING ARRANGEMENTS IN PALANADU HOME MINISTER MK

పల్నాడులో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం: హోం మంత్రి మేకతోటి సుచరిత

ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత

ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత

వర్షాలు పడి రైతులు, రైతు కూలీలు పనుల్లో నిమగ్నమై.. నిరుద్యోగులు పోటీ పరీక్షలు రాస్తూ రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉంటే కొందరికి నచ్చడం లేదన్నారు. అందులో భాగంగానే గుంటూరు జిల్లాలో భౌతికదాడులు జరుగుతున్నాయని, భయాందోళనతో ప్రజలు వలసలు వెళ్తున్నారన్న ఆరోపణలు చేస్తున్నారన్నారు.

ఇంకా చదవండి ...
    శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించబోమని హోంమంత్రి మేకతోటి సుచరిత హెచ్చరించారు. సోమవారం వెలగపూడి సెక్రటేరియట్ లో  మంత్రి మేకతోటి సుచరిత డీజీపీ గౌతమ్ సవాంగ్ తో కలిసి విలేఖర్లతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతీ సోమవారం స్పందన కార్యక్రమం జరగుతోందని... ఫిర్యాదులకు 15 రోజుల్లో పరిష్కారం చూపించాలని సీఎం ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు. వర్షాలు పడి రైతులు, రైతు కూలీలు పనుల్లో నిమగ్నమై.. నిరుద్యోగులు పోటీ పరీక్షలు రాస్తూ రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉంటే కొందరికి నచ్చడం లేదన్నారు. అందులో భాగంగానే గుంటూరు జిల్లాలో భౌతికదాడులు జరుగుతున్నాయని, భయాందోళనతో ప్రజలు వలసలు వెళ్తున్నారన్న ఆరోపణలు చేస్తున్నారన్నారు. అన్ని రాజకీయ పార్టీలు పల్నాడు ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. పల్నాడులో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామన్నారు.

    పల్నాడులో పెయిడ్‌ ఆర్టిస్టులతో కొందరు శిబిరాలు పెడుతూ ప్రశాంతతకు భంగం కలిగించాలని చూస్తున్నారన్నారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో రాష్ట్రంలో రాక్షస పాలన జరిగిందని మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలోని పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి అక్రమ మైనింగ్‌ గురించి ఫిర్యాదు చేసినందుకు ఒక వ్యక్తిని దారుణంగా హింసించారన్న విషయం మంత్రి గుర్తుచేశారు.
    First published:

    Tags: Andhra Pradesh, Ap, Palnadu, Tdp, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు