Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    Nutan Naidu: నూతన్ నాయుడు మోసాలు, సంచలన విషయాలు బయటపెట్టిన సీఎంవో అధికారి

    ముఖ్యమంత్రి కార్యాలయంలో అడిషనల్ చీఫ్ సెక్రటరీ టు సీఎం హోదాలో పనిచేస్తున్న పీవీ రమేష్ పేరు చెప్పి నూతన్ నాయుడు కొందరికి ఫోన్లు చేసి డబ్బు, ఇతర ప్రయోజనాలు డిమాండ్ చేశాడని తెలిపారు.

    news18-telugu
    Updated: September 4, 2020, 9:48 PM IST
    Nutan Naidu: నూతన్ నాయుడు మోసాలు, సంచలన విషయాలు బయటపెట్టిన  సీఎంవో అధికారి
    నూతన్ నాయుడు (File)
    • Share this:
    Nutan Naidu: బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు చేసిన ఓ మోసం వెలుగులోకి వచ్చింది. ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆఫీసులో పనిచేసే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పేరు చెప్పి డబ్బులు డిమాండ్ చేశాడు. తన పేరు చెప్పి నూతన్ నాయుడు కొందరికి ఫోన్లు చేసి వసూళ్లు చేశారంటూ సదరు అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో అడిషనల్ చీఫ్ సెక్రటరీ టు సీఎం హోదాలో పనిచేస్తున్న పీవీ రమేష్ పేరు వాడుకుని మోసానికి పాల్పడ్డాడు. తన పేరుతో నూతన్ నాయుడు పలువురికి ఫోన్లు చేశాడని, +91 82979 89375 నెంబర్ నుంచి కొందరు ప్రభుత్వ అధికారులు, ఇతరులకు ఫోన్లు చేసి డబ్బులు, ఇతర ప్రయోజనాలు డిమాండ్ చేసినట్టు తన దృష్టికి వచ్చిందని పీవీ రమేష్ తెలిపారు. ఇవి కేవలం మోసానికి పాల్పడడమే కాదు. తన పేరు ప్రతిష్టలను కూడా నాశనం చేశాడని పీవీ రమేష్ ఆరోపించారు. తన పేరుతో ఎవరైనా ఫోన్ చేస్తే ఎవ్వరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అలాంటి ఫోన్ ఏదైనా వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాంటి ఫోన్ ఏదైనా వస్తే డీజీపీకి కానీ, విశాఖ సీపీకి కానీ, లేకపోతే నేరుగా తనకే ఫోన్ చేయవచ్చని ఫోన్ నెంబర్లను ఇచ్చారు పీవీ రమేష్.

    మరోవైపు విశాఖ శిరోముండనం కేసులో నిందితుడు నూతన్ నాయుడును పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న నూతన్ నాయుడును పోలీసులు కర్ణాటకలోని ఉడుపిలో అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న అతడిని ఉడుపిలో పోలీసులు పట్టుకున్నారని విశాఖ సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా చెప్పారు. శిరోముండనం కేసులో నూతన్‌ నాయుడు పాత్ర ఉందని తేలిన తరువాతనే అతన్ని అరెస్ట్‌ చేశామన్నారు. దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్‌ కుమార్‌ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మధుప్రియ సూచన మేరకే ఈ శిరోముండనం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇదివరకే ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు విశాఖ సిటీ పోలీసు కమిషనర్ తెలిపారు.

    విశాఖలోని పెందుర్తిలో శ్రీకాంత్ అనే యువకుడు నూతన్ నాయుడు నివాసంలో పనిచేసేవాడు. అయితే, వారి ఇంట్లో పనిమానేసిన అతడిని పిలిపించిన నూతన్ నాయుడు కుటుంబసభ్యులు అతడు ఫోన్ దొంగతనం చేశాడంటూ కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అలాగే, అతడికి శిరోముండనం చేశారు. ఈ ఘటన కూడా సీసీటీవీలో రికార్డు అయింది. ఈ కేసుకు సంబంధించిన ఇప్పటికే ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా నూతన్ నాయుడును అరెస్ట్ చేశారు.
    Published by: Ashok Kumar Bonepalli
    First published: September 4, 2020, 9:37 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading