Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    Nutan Naidu: నూతన్ నాయుడు అరెస్ట్, ఆ రాష్ట్రంలో పట్టుకున్న ఏపీ పోలీసులు

    Head Tonsuring Case: ముంబైకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న అతడిని ఉడుపిలో పోలీసులు పట్టుకున్నారని విశాఖ సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా చెప్పారు.

    news18-telugu
    Updated: September 4, 2020, 4:56 PM IST
    Nutan Naidu: నూతన్ నాయుడు అరెస్ట్, ఆ రాష్ట్రంలో పట్టుకున్న ఏపీ పోలీసులు
    బిగ్‌బాస్ ఫేమ్ నూతన్ నాయుడు అరెస్ట్ (File/Photos)
    • Share this:
    Nutan Naidu arrested: విశాఖ శిరోముండనం కేసులో నిందితుడు నూతన్ నాయుడును పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న నూతన్ నాయుడును పోలీసులు కర్ణాటకలోని ఉడుపిలో అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న అతడిని ఉడుపిలో పోలీసులు పట్టుకున్నారని విశాఖ సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా చెప్పారు. శిరోముండనం కేసులో నూతన్‌ నాయుడు పాత్ర ఉందని తేలిన తరువాతనే అతన్ని అరెస్ట్‌ చేశామన్నారు. దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్‌ కుమార్‌ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మధుప్రియ సూచన మేరకే ఈ శిరోముండనం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇదివరకే ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు విశాఖ సిటీ పోలీసు కమిషనర్ తెలిపారు.

    విశాఖలోని పెందుర్తిలో శ్రీకాంత్ అనే యువకుడు నూతన్ నాయుడు నివాసంలో పనిచేసేవాడు. అయితే, వారి ఇంట్లో పనిమానేసిన అతడిని పిలిపించిన నూతన్ నాయుడు కుటుంబసభ్యులు అతడు ఫోన్ దొంగతనం చేశాడంటూ కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అలాగే, అతడికి శిరోముండనం చేశారు. ఈ ఘటన కూడా సీసీటీవీలో రికార్డు అయింది. ఈ కేసుకు సంబంధించిన ఇప్పటికే ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా నూతన్ నాయుడును అరెస్ట్ చేశారు.

    మరోవైపు విశాఖలోని పెందుర్తిలో శిరోముండనం బాధితుడు శ్రీకాంత్‌ను కొన్ని రోజుల క్రితం ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ పరామర్శించారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌ రాజ్‌, వైసీపీ నగర కన్వీనర్‌ వంశీకృష్ణ శ్రీనివాస్‌ తదితరులు శ్రీకాంత్‌ ఇంటికి వెళ్లారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దళితులపై దాడులను ప్రభుత్వం సహించదని మంత్రి అవంతి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. ఘటన జరిగిన తీరుతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. ప్రభుత్వం అన్ని రకాలుగా శ్రీకాంత్ కు బాసటగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన లో దళితులు, బలహీన వర్గాలకు పూర్తిస్థాయి న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున శ్రీకాంత్‌కు లక్ష రూపాయల నగదు, సొంత ఇల్లు, ఔట్ ‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఉన్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు కూడా తన సొంత నగదు రూ.50 వేలను శ్రీకాంత్‌కు అందజేశారు. ఈ ఘటనలో ఇప్పటికే నిందితులు ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారని మంత్రి అవంతి తెలిపారు.
    Published by: Ashok Kumar Bonepalli
    First published: September 4, 2020, 4:56 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading