కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు.. క్లారిటీ ఇచ్చిన ఏపీ మంత్రి

ప్రస్తుతం ఏపీలో కొత్త జిల్లాల అధ్యయనానికి కమిటీ వేయడంతో.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకుంటారా ? లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

news18-telugu
Updated: July 17, 2020, 2:39 PM IST
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు.. క్లారిటీ ఇచ్చిన ఏపీ మంత్రి
నందమూరి తారక రామారావు (Twitter/NTR)
  • Share this:
తాము అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని తన పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ప్రస్తుతం ఏపీలో కొత్త జిల్లాల అధ్యయనానికి కమిటీ వేయడంతో.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకుంటారా ? లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే సీఎం జగన్ కచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని విజయవాడకు చెందిన ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెడతారా లేక మచిలీపట్నం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతారా అన్నది తేలాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ అంశంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్‌ను వంద శాతం ఆగస్టులోనే ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే దుర్గగుడి ఫ్లై ఓవర్ పనులు ఆలస్యమయ్యాయని... తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పనుల్లో వేగం పెంచామని ఆయన వివరించారు.
Published by: Kishore Akkaladevi
First published: July 17, 2020, 2:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading