జగన్ తీరుపై మండిపడుతున్న ఎన్టీఆర్ అభిమానులు..

ఏపీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి తీరుపై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఏంటి జగన్ పై మండిపడటం ఏమిటి అనుకుంటున్నారా ? వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: May 29, 2020, 1:49 PM IST
జగన్ తీరుపై మండిపడుతున్న ఎన్టీఆర్ అభిమానులు..
ఎన్టీఆర్, జగన్
  • Share this:
ఏపీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి తీరుపై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఏంటి జగన్ పై మండిపడటం ఏమిటి అనుకుంటున్నారా ? వివరాల్లోకి వెళితే.. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసి రేపటితో యేడాది పూర్తి కావొస్తోంది. వచ్చిన యేడాదిలోపే ఇచ్చిన హామిలను దాదాపు నెరవేర్చినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఓ విషయంలో మాత్రం ఎన్టీఆర్ అభిమానులు.. జగన్ తీరుపై గుర్రుగా ఉన్నారు.  గత ఎన్నికల సందర్భంగా జగన్ పాదయాత్రలో కృష్ణా జిల్లాకు స్వర్గీయ ఎన్టీఆర్ పేరు పెడతా అని అప్పట్లో హామి ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయమే మరిచిపోయారు. ఐతే.. నిన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా అందరు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన ఏపీ ప్రభుత్వం కనీసం ప్రకటన కూడా చేయకపోవడాన్ని ఎన్టీఆర్ అభిమానులు జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో కొంత మంది ఎన్టీఆర్ అభిమానులు.. చంద్రబాబు తీరు పై విసుగొచ్చి గత ఎన్నికల్లో వైసీపీకే ఓటు వేసారు. మరి ఇచ్చిన మాట ప్రకారం వైయస్ జగన్.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఇచ్చిన హామిని నెరవెేర్చుకుంటాడా లేదా అనేది చూడాలి.
First published: May 29, 2020, 1:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading