తిరుమల శ్రీవారి సేవలో ఎన్టీఆర్ బయోపిక్ టీం

నాన్నగారి జీవిత చరిత్రలో ఆయన పాత్రను పోషించే మహాద్బాగ్యం కలగడం పూర్వజన్మ సుకృతమన్నారు బాలకృష్ణ. ఎన్టీఆర్ బయోపిక్ ఓ చరిత్రలా నిలిచిపోతుందన్నారు హీరో సుమంత్

news18-telugu
Updated: January 8, 2019, 11:00 AM IST
తిరుమల శ్రీవారి సేవలో ఎన్టీఆర్ బయోపిక్ టీం
శ్రీవారి సేవలో ఎన్టీఆర్ బయోపిక్ టీం
  • Share this:
ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర యూనిట్ సభ్యులు తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, సుమంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేశారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో బాలకృష్ణ, సుమంత్, విద్యాబాలన్ కు వేదపండితులు ఆశీర్వచనాలు అందచేశారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందించి పట్టువస్త్రంతో సత్కరించారు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం విడుదల సందర్భంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చి స్వామి వారి ఆశీస్సులు పొందనని నందమూరి బాలకృష్ణ అన్నారు. నాన్నగారి జీవిత చరిత్రలో ఆయన పాత్రను పోషించే మహాద్బాగ్యం కలగడం పూర్వజన్మ సుకృతమన్నారు.

ఎన్టీఆర్‌లో చాలామందికి కనిపించని కోణాలు సినిమాలో ఉన్నాయన్నారు. క్రిష్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారన్నారు. క్రిష్ డైరెక్షన్‌లో రెండు చారిత్రక పాత్రలు చేశానన్నారు. కథనాయకుడు సినిమా మొదటి భాగం వ్యవధి రెండుగంటల 90 నిమిషాలు ఉంటుందని తెలిపారు. తిరుపతిలో పీజేఆర్ మూవీ ల్యాండ్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ ఓ చరిత్రలా నిలిచిపోతుందన్నారు హీరో సుమంత్. ప్రజలంతా సుఖఃసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్ధించినట్లు ఎన్టీఆర్ బయోపిక్ టీం తెలిపింది.

ఇవికూడా చదవండి:

‘ఎన్టీఆర్’ కోసం జోలె పట్టిన బాలకృష్ణ..

నిమ్మకూరులో సందడి చేసిన ఎన్టీఆర్, బసవతారకం
First published: January 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...