హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TTD : టీటీడీ కీలక నిర్ణయం... గోవింద మొబైల్ యాప్‌లో ప్రత్యేక ఆఫర్

TTD : టీటీడీ కీలక నిర్ణయం... గోవింద మొబైల్ యాప్‌లో ప్రత్యేక ఆఫర్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TTD : కరోనా వైరస్ వచ్చాక భక్తులకు కలిగే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని టిటీటీ ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇది అలాంటిదే.

  TTD : తిరుపతి... తిరుచానూరు ప‌ద్మావ‌తి అమ్మవారి ఆల‌యంలో జూలై 31న వ‌ర్చువ‌ల్ విధానంలో వరలక్ష్మీ వ్రతం జరగనుంది. ఈ వ్రతంలో పాల్గొనేవారు టికెట్లను కొనేందుకు టీటీడీ... ఆన్‌లైన్ విధానంలో... గోవింద మొబైల్ యాప్‌ని అందుబాటులో ఉంచింది. ఈ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకూ ఈ యాప్ వాడనట్లైతే... ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైల్ వాడేవారు గూగుల్ ప్లే స్టేర్ నుంచి గోవింద మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత... ఈ-టికెట్లు పొందవచ్చు. ఇదివరకు ఎప్పుడూ ఇలా వర్చువల్ విధానంలో అమ్మవారి వ్రతం జరపలేదు. ఐతే... భక్తులే ఈ ఆలోచనను తెరపైకి తెచ్చారు. ఇది బాగానే ఉండటంతో... వర్చువల్ సేవా విధానంగా వరలక్ష్మీ వ్రతాన్ని జరపబోతున్నారు. ఇప్పటికే చాలా మంది భ‌క్తులు టీటీడీ వెబ్‌సైట్ ద్వారా ఈ-టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇలా బుక్ చేసుకున్నవారికి... టీటీడీ... పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా... పూజాసామగ్రిని సప్లై చేసింది.

  పూజా సామగ్రి కోసం ప్రత్యేక పూజ :

  వరలక్ష్మీ వ్రతం టికెట్లు పొందిన భక్తులకు ఇవ్వాల్సిన పూజా సామగ్రి, ప్రసాదాల కోసం సోమవారం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అందులో భాగంగా టీటీడీ చీఫ్ ఇంజినీర్ ఎం.ర‌మేష్‌రెడ్డి, ఆల‌య అధికారులు, అర్చకులతో క‌లిసి పూజాసామ‌గ్రిని ఆల‌యం చుట్టూ ప్రదక్షిణగా ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆ తర్వాత అమ్మవారి మూల‌విరాట్టు పాదాల దగ్గర ఉత్తరీయం, ర‌విక‌, ప‌సుపు, కుంకుమ‌, గాజులు, అక్షిత‌లు, కంక‌ణాలు ఉంచి పూజ‌లు చేశారు. టికెట్లు బుక్ చేసుకున్న గృహ‌స్తుల గోత్రనామాల్ని అర్చక స్వాములు అమ్మవారికి నివేదించారు. తర్వాత పూజాసామ‌గ్రిని గృహ‌స్తుల‌కు ఇవ్వడానికి పోస్టల్ అధికారులకు చేరవేశారు.

  జులై 31న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకూ వరలక్ష్మీ అమ్మవారి వ్రతం... SVBCలో లైవ్‌లో వస్తుంది. వ్రతంలో పాల్గొనే భక్తులు... అర్చకులు చెప్పినట్లుగా చేస్తూ... తమ గోత్ర నామాలతో సంకల్పం చెప్పాల్సి ఉంటుంది.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Tirumala news, Ttd

  ఉత్తమ కథలు