మంగళగిరి నియోజకవర్గం (Mangalagiri Constitution) ఇప్పటంలో ఆక్రమ నిర్మాణాల తొలగింపుపై కోర్టుకు వెళ్లిన పిటీషనర్లపై ఏపీ హైకోర్టు (Andhra Pradesh High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాల తొలగింపుపై అధికారులు నోటీసులు ఇచ్చినా కూడా ఇవ్వలేదని కోర్టుకు అబద్దం చెప్పి పిటీషనర్లు స్టే తెచ్చుకున్నారు. అధికారులు నోటీసులు ఇచ్చినా కూడా ఇవ్వలేదని చెప్పి కోర్టును తప్పు దోవ పట్టించారని పిటీషనర్లపై కోర్టు (High Court) మండిపడింది. ఈ మేరకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది. మొత్తం 14 మంది పిటీషనర్లకు కోర్టు లక్ష చొప్పున ఫైన్ కట్టాలని కోర్టు (High Court) ఆదేశించింది.
నోటీసులు ఇవ్వలేదన్న గ్రామ రైతులు..
ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతపై అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని గ్రామ రైతులు హైకోర్టు (High Court) ను ఆశ్రయించారు. తమకు చేప్పకుండానే ఇళ్లు కూల్చివేశారని 14 మంది రైతులు కోర్టు (High Court) ను ఆశ్రయించారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు (Andhra Pradesh High Court) కూల్చివేతలు ఆపాలని స్టే ఇచ్చింది. దీనితో పనులు నిలిచిపోయాయి. అయితే రైతులు తప్పుడు సమాచారం ఇచ్చారని తదుపరి విచారణలో వెల్లడైంది. దీనితో కోర్టు రైతులను ప్రశ్నించింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై తమకు అవగాహన లేదని రైతులు పేర్కొన్నారు. రైతుల వాదనను తిరస్కరించిన న్యాయమూర్తి కోర్టు (High Court) ను తప్పుదోవ పట్టించినందుకు వారికి భారీ జరిమానా విధించింది.
అండగా జనసేన ...
ఈ ఘటన అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పటం గ్రామంలో పర్యటించారు. వారికి అండగా ఉంటామని హామీనిచ్చారు. మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో వైసిపి ప్రభుత్వం దాష్టీకానికి ఇళ్లు దెబ్బ తిన్న వారు, ఆవాసాలు కోల్పోయిన వారికి లక్ష రూపాయల వంతున ఆర్ధికంగా అండగా నిలబడాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిర్ణయించారు. మార్చి 14వ తేదీన ఇప్పటం శివారులో జరిగిన జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం వాసులు సహకరించారని, సభాస్థలిని ఇచ్చారని కక్ష గట్టి శుక్రవారం నాడు పోలీసుల బందోబస్తుతో జేసీబీల సహాయంతో ఇళ్లను కూల్చి వేశారు. దీనితో బాధితుల కుటుంబానికి రూ.లక్ష చొప్పున సహాయం అందిస్తామని ప్రకటన చేశారు. ఈ మొత్తాన్ని ఈనెల 27న అందజేయనున్నట్లు తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap, AP News, Highcourt, Mangalagiri