Tiger Tension: చిక్కినట్టే చిక్కి.. అధికారులకు చుక్కలు చూపించిన బెంగాల్ టైగర్ ఇప్పుడు రూటు మార్చింది. గత నెలన్నర రోజులుగా కాకినాడ జిల్లా (Kakinada District) ప్రత్తిపాడు నియోజకవర్గంలో అదిగో పులి (Tiger).. ఇదిగో పులి అన్న మాటలే ఎక్కువగా వినిపించాయి. అదిగో ఆ దారిలో నేను పులిని చూశానంటే.. ఇదిగో ఇటువైపు రోడ్డు దాటుతుంటే నేను చూశానంటూ ఇలా ఎవరి నోట విన్నా అదే భయం. అయిత ఆ పులిని పట్టుకోడానికి అటవీ అధికారులు చేయని ప్రయత్నం లేదు. ఎరలతో భారీ బోనులను ఏర్పాటు చేశారు. అయినా ఆ పులి మాత్రం.. బోను దగ్గరకు వచ్చినట్టే వచ్చి.. చేజారేది. దీంతో అధికారుల ప్రయత్నాలు అన్నీ చిత్తయ్యాయి. దీంతో ఇంతకీ ఈ పులి చిక్కెదెప్పుడు..? చిక్కను దొరకను అన్నట్లు అటవీశాఖ అధికారులతో పులి దాగుడుమూతలు ఆడిన ఆ పులిని పట్టుకునేది ఎప్పుడు అని అంతా భయపడుతున్న వేళ.. మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే అధికారులు పెట్టిన బోనులను పసిగట్టిన పులి.. వారికి చిక్కకుండా తిరుగుతూ.. చివరికి కాకినాడలో ఎగ్జిట్ ఇచ్చింది. ఇప్పుడు అక్కడ నుంచి మెల్లగా అనకాపల్లి జిల్లా (Anakapalli District) లో ఎంట్రీ ఇచ్చింది.
తాజాగా ఇప్పుడు పులి అనకాపల్లి జిల్లాల అడుగు పెట్టింది అని తెలియడంతో ఇక్కడి ప్రజలకు నిద్ర లేకుండా చేసింది. ఇన్నాళ్లూ కాకినాడ ప్రజలను హడలెత్తించిన పెద్దపులి ఇప్పుడు అనకాపల్లి జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. రావడం రావడమే ఒక ప్రాణం తీసేసి వార్నింగ్ కూడా ఇచ్చేసింది టైగర్. నెలరోజులుగా కాకినాడ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన బెంగాల్ టైగర్ అసలు ఎలా రూట్ మార్చింది. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వారి కళ్లు ఎలా కప్పింది.. దారులన్నింటిపైనా నిఘా పెట్టినా ఎక్కడా ఎందుకు చిక్కలేదు..?
ఆ పులి ఎలా తప్పించుకున్నా.. ఇఫ్పుడు అనకాపల్లి జిల్లాలో బెంగాల్ టైగర్ పాదముద్రలను అటవీ అధికారులు గుర్తించారు. కాకినాడ జిల్లాను విడిచిపెట్టిన పెద్దపులి అనకాపల్లి జిల్లాలోకి ఎంటరైందని నిర్ధారించారు. అయితే అది ఈ జిల్లాలో ఎంటర్ అవతూనే, తానొచ్చంటూ హెచ్చరికలు పంపింది. యలిమంచిలిపాలెం రేంజ్ ఫారెస్ట్‌లోకి ఎంటరైన టైగర్ కోట ఊరట్ల మండలం టి.జగ్గంపేట దగ్గర గేదెపై ఎటాక్ చేసి చంపేసింది. పగ్ మార్క్స్ ఆధారంగా పులి కోసం వేట కొనసాగిస్తున్నారు ఫారెస్ట్ టీమ్. అనకాపల్లి తర్వాత విశాఖ జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉండటంతో బోర్డర్స్‌లో బోన్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి : ఎన్టీఆర్ రాజకీయ వారసుడు ఎవరు..? జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి తెచ్చిన మాజీ మంత్రి కొడాలి నాని.. ఏమన్నారంటే..?
అయితే నిన్నటివరకు కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం భయాందోళన కలిగించింది. తుని మండలంలోని మరువాడ గ్రామ శివారులోని జీడితోటలో పులి పాదముద్రలను గుర్తించారు. పులి సంచరిస్తున్న గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేసినట్లు ఫారెస్ట్ రేంజర్ ధర్మరాజు తెలిపారు. కాకినాడ జిల్లాలో నెలరోజులుగా సంచరిస్తున్న పెద్దపులి అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. అయితే పులిని గుర్తించిన తరువాత నెలన్నర అయినా బోనులో బంధించకపోవడం ఇదే తొలిసారి అంటున్నారు అధికారు.. ఇప్పటి వరకు ఇంత తెలివిగా తప్పించుకుంటున్న పులిని ఎప్పుడూ చూడలేదు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Kakinada, Tiger Attack