నవరత్నాలపై జగన్ తొలి సంతకం...? ఇవాళ్టి నుంచే అమలు...

AP New CM YS Jagan : ప్రమాణ స్వీకారం తర్వాత వెంటనే మేనిఫెస్టో అమలు, నవరత్నాల హామీల అమలుపై వైసీపీ దృష్టి సారించబోతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 30, 2019, 6:33 AM IST
నవరత్నాలపై జగన్ తొలి సంతకం...? ఇవాళ్టి నుంచే అమలు...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
ఏపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ వైసీపీ తన మేనిఫెస్టోను ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే గ్రాండ్ విక్టరీ సాధించింది. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చిన ఆ పార్టీ అధినేత జగన్... రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసి.. పేదలకు అండగా... నవరత్నాల హామీలను కలిపి మేనిఫెస్టోను రూపొందించారు. ఇక ఇప్పుడు ప్రమాణ స్వీకారంతో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి... హామీలను అమలు చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టబోతున్నారు. నిధులపై లెక్కలు తేల్చేసిన జగన్... ఇవాళ సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకం నవరత్నాలపై పెట్టబోతున్నట్లు తెలిసింది.

నవరత్నాలు ఇవే :
1.వైఎస్ఆర్ రైతు భరోసా

2.ఫీజు రీయింబర్స్‌మెంట్
3.ఆరోగ్యశ్రీ


4.జలయజ్ఞం
5.మద్యపాన నిషేధం6.అమ్మ ఒడి
7.వైఎస్ఆర్ ఆసరా
8.పేదలందరికీ ఇళ్లు
9.పెన్షన్ల పెంపు

వైసీపీ మేనిఫెస్టోలో కీలక అంశాలు :
* రైతులకు ఉచితంగా బోర్లు... కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు
* రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్
* రైతుల కోసం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
* ఆక్వా రైతులకు యూనిట్‌ రూపాయికే కరెంటు.
* రైతులకు రూ.12,500 చొప్పున 4 దఫాలుగా రూ.50వేలు
* రైతు కుటుంబాలకు రూ.7లక్షలతో బీమా
* రైతులకు సున్నా వడ్డీకే రుణాలు
* వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి.
* అన్ని రకాల వ్యాధులు ఆరోగ్య శ్రీ పరిధిలోకి
* కిడ్నీ సహా ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10వేలు పింఛన్
* వృద్ధాప్య పింఛన్ రూ.3 వేలకు పెంపు
* పింఛన్ అర్హత వయసు 65 నుంచి 60కి తగ్గింపు
*అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయింపు
* మూడు దశల్లో మద్యపాన నిషేధం. 2024 నాటికి పూర్తిగా నిషేధం.
* ఖాళీగా ఉన్న లక్షా 30వేల ఉద్యోగాలు భర్తీ
* ఐదేళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణం.
* ఎస్సీ, ఎస్టీ అమ్మాయిల పెళ్లికానుక కింద రూ.లక్ష... బీసీ అమ్మాయిలకు రూ.50వేలు ఆర్థిక సాయం
* కాపు కార్పొరేషన్‌కు రూ.2వేల కోట్లు కేటాయింపు.
* శాశ్వత ప్రాతిపదికన బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ఏర్పాటు
* అర్చకులకు రిటైర్మెంట్ విధానం రద్దు, ఇళ్ల నిర్మాణం
* ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం ఓ జిల్లాగా ఏర్పాటు
* పిల్లలను బడికి పంపిస్తే, ప్రతీ తల్లికి ఏడాదికి రూ.10,500.
* 45 ఏళ్లు నిండిన ప్రతీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు మొదటి ఏడాది తర్వాత రూ.75వేలు
* ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు.
* పోలవరం, వెలిగొండ పథకాలు పూర్తి
* గ్రామ సచివాలయం ఏర్పాటు. అదే గ్రామంలో 10మందికి ఉద్యోగం.
* జీవన భీమా కింద 18సం. నుంచి 50సం. లోపు ఉన్నవారు మరణిస్తే రూ.1లక్ష.
* బీసీల అభ్యున్నతికి ఏడాదికి రూ.15వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.75వేల కోట్లు ఖర్చు
* ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా.
* మగ్గం ఉన్న ప్రతీ కుటుంబానికి సంవత్సరానికి రూ.24వేలు ప్రోత్సాహం.
* చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు... సున్నా వడ్డీకే రూ.10వేలు.

పథకాల అమలుకు రూ.56 వేల కోట్లు : వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోలోని కొత్త పథకాలకు రూ.56,000 కోట్లు ఖర్చవుతాయని అంచనా. పిల్లలను బడికి పంపే తల్లులకు ప్రతి ఏటా రూ.15,000 ఇస్తానని జగన్‌ చెప్పిన పథకానికి ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలున్నాయి. పెట్టుబడి కోసం ప్రతి రైతు కుటుంబానికి రూ.50,000 ఇస్తామని వైసీపీ మేనిఫెస్టోలో చెప్పారు కాబట్టి... ఇది కూడా కష్టసాధ్యమైన పథకమే. పెన్షన్లు రూ.3వేలకు పెంచితే, ప్రభుత్వంపై అదనంగా ఏడాదికి రూ.6,400 కోట్లకు పైగా భారం పడుతుంది. టీడీపీ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి... రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టింది. కేంద్రం నుంచీ నిధులు రావకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్లు చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తున్న వైసీపీ... నిధుల కోసం వేటాడాల్సి వస్తుంది. ఈ సమస్య నుంచీ రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కిస్తారన్నది వైసీపీ ముందు ఉన్న అసలైన సవాల్ అని మనం అనుకోవచ్చు.
First published: May 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు