Aarogyasri : ఇప్పటివరకూ ఏపీ వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల్ని ఏపీకి మాత్రమే పరిమితం చేసింది. ఐతే... ఆంధ్రా ప్రజల ఏపీతోపాటూ... తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో కూడా ఎక్కువ సంఖ్యలో ఉండటంతో... ఆ రాష్ట్రాల్లో కూడా ఈ పథకాన్ని నేడు ప్రారంభించింది. దీంతో... హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో కూడా ఇవాళ్టి నుంచీ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం గుర్తించిన 130 ఆస్పత్రుల్లో ఈ సూపర్ స్పెషాలిటీ సేవలు అమల్లోకి వచ్చాయి. వైయస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అందుబాటులోకి 17 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 716 రకాల వైద్య ప్రక్రియలు అమల్లోకి వచ్చినట్లైంది. తద్వారా అక్కడి ఏపీ ప్రజలు... ఆరోగ్యశ్రీ సేవల కోసం... అక్కడి నుంచీ ఏపీకి రావాల్సిన అవసరం లేకుండా... అక్కడే ఆ సేవల్ని పొందే అవకాశం లభిస్తోంది.
ఆరోగ్యశ్రీకి సంబంధించి చెన్నైలోని MIOT, బెంగుళూరులోని ఫోర్టిస్, హైదరాబాద్‌లోని మెడ్‌కవర్ ఆస్పత్రి డాక్టర్లు, అక్కడి ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. చికిత్సల విధానంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఏపీ రాష్ట్రానికి చెందిన వారిని బాగా చూసుకోవాలని డాకర్టర్లను కోరారు. ఎంతో విశ్వాసం, నమ్మకంతో చికిత్సకోసం అక్కడకు వచ్చారని అన్నారు. బాధితులు కోలుకునేంతవరకూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు జగన్.
Photos : ఇషా రెబ్బా క్యూట్ ఫోటోషూట్... తెలుగమ్మాయి తళుకులు...
ఇవి కూడా చదవండి :
ఏపీ సీఎం జగన్‌కు బిగ్ షాక్... పిటిషన్ కొట్టివేసిన సీబీఐ కోర్టు
అనసూయ జబర్దస్త్ సందేశం... యువతకు ప్రత్యేకం
కర్తార్‌పూర్ యాత్రికులకు పాకిస్థాన్ ఆహ్వానం... ఇమ్రాన్‌ఖాన్ ఏమన్నారంటే...
మహారాష్ట్రలో ఏం జరుగుతోంది? ప్రభుత్వం ఏర్పాటయ్యేదెప్పుడు?
ఆర్టీసీ డ్రైవర్ బాబు అంత్యక్రియలపై సస్పెన్స్... నేడు కరీంనగర్ బంద్?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aarogyasri, Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Telugu news, Telugu varthalu