మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunitha) పాదయాత్ర ప్రారంభం అయింది. శ్రీ సత్యసాయి జిల్లా పేరూరు మండలం గరిమాకుల పల్లి గ్రామంలో ఆమె పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్ర గరిమకులపల్లి నుంచి పేరూరు వరకు మొత్తం 18 కిలోమీటర్ల మేర పరిటాల సునీత (Paritala Sunitha) పాదయాత్ర కొనసాగనుంది. కాగా పరిటాల సునీత రైతుల కోసం ఈ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు భారీగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్బంగా పరిటాల సునీత (Paritala Sunitha) మాట్లాడుతూ..సీఎం జగన్ కేవలం బటన్ నొక్కడానికే పరిమితమయ్యారు. వర్షాలతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన, కేసులు పెట్టిన పాదయాత్ర ఆపేది లేదని స్పష్టం చేశారు.
'రైతు కోసం' పాదయాత్రను ప్రారంభించిన పరిటాల సునీత (Paritala Sunitha) రైతుల సమస్యలు తెలుసుకోడానికే పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. వర్షాలకు, వరదలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు.వారికి న్యాయం చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని ఆమె అన్నారు. నష్టపోయిన రైతులకు 30 వేల నుంచి 50 వేల వరకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే అందరికి ఇన్సూరెన్స్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్సూరెన్సు డబ్బులను కూడా రాజకీయం చేస్తున్నారని పరిటాల సునీత (Paritala Sunitha) ప్రభుత్వంపై మండిపడ్డారు.
సీఎం జగన్ బటన్ నొక్కితే సరిపోదని జగన్ రెడ్డిని అందరూ బటన్ రెడ్డి అంటున్నారని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో అనేక మందికి ఫించన్లు తొలగించారని, చేనేత కార్మికులకు నేతన్న హస్తం కూడా ఇవ్వడం లేదని ఆమె వాపోయారు. పాదయాత్ర చేసి రైతుల సమస్యలు తెలుసుకొని ఈ ఇబ్బందులను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోడానికి ప్రజల వద్దకు వెళ్తుంటే పర్మిషన్ లేదని అడ్డుకునే ప్రయత్నం చేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఎన్ని కేసులైన పెట్టుకొండి..తాము భయపడేది లేదన్నారు.
ఈ పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గం నుండి పేరూరు వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. ఎంసీపల్లి, చిన్న కొండాపురం, పెద్ద కొండాపురం, మక్కినవారిపల్లి గ్రామాల రైతులను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం పేరూరులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబెడ్కర్ విగ్రహానికి పరిటాల సునీత (Paritala Sunitha) వినతి పత్రం అందజేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, AP News, Paritala Sunita, TDP, Ycp