వైరస్ భయంతో చికెన్, మటన్‌పై నిషేధం.. రంగంలోకి వైసీపీ ఎమ్మెల్యే

ప్రతీకాత్మక చిత్రం

వైరస్ బారినపడి చనిపోయిన కోళ్లను కాలువలు, రోడ్డు పక్కన పడేయకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మున్సిపల్‌, ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ సిబ్బందిని అప్రమత్తం చేశామన్న నాగేశ్వరరావు.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారం రోజులు నాన్‌ వెజ్‌ హాలీడేగా ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు.

  • Share this:
    చైనాలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనావైరస్ ఇప్పటికే వెయ్యి మందిని బలితీసుకుంది. వేలాది మంది వైరస్ బారిన పడడంతో ప్రపంచ దేశాలన్నీ భయంతో వణికిపోతున్నాయి. మాంసాహారం తినడం వల్లే కరోనావైరస్ వ్యాపిస్తోందని పుకార్లు షికార్లు చేస్తున్న వేళ.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. తణుకు నియోజకవర్గంలో అంతుచిక్కని వైరస్ సోకి పౌల్ట్రీ ఫారాల్లోని కోళ్లు చనిపోతున్నాయి. పెద్ద మొత్తంలో కోళ్లు మృత్యువాత పడుతుండడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే తణుకు వ్యాప్తంగా మటన్, చికెన్ అమ్మకాలపై వారం పాటు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు.

    తణుకులో పరిస్థితిని వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమీక్షిస్తున్నారు. బుధవారం నుంచి వారం రోజుల పాటు మటన్, చికెన్ అమ్మకాలను నిలిపివేస్తున్నామని ఆయన తెలిపారు. వైరస్ బారినపడి చనిపోయిన కోళ్లను కాలువలు, రోడ్డు పక్కన పడేయకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మున్సిపల్‌, ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ సిబ్బందిని అప్రమత్తం చేశామన్న నాగేశ్వరరావు.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారం రోజులు నాన్‌ వెజ్‌ హాలీడేగా ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. ఐతే కోళ్లకు వస్తున్న ఈ వైరస్‌తో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా వైరసేమోనని ఆందోళన చెందుతున్నారు. ఐతే కోళ్లకు వచ్చే వైరస్‌కు, కరోనా వైరస్‌కు సంబంధం లేదని అధికారులు తెలిపారు.
    Published by:Shiva Kumar Addula
    First published: