Home /News /andhra-pradesh /

NOBEL PRIZE WINNER ESTHAR DUFLO MEETS AP CM YS JAGAN AND DISCUSSED ABOUT GOVERNMENT WELFARE SCHEMES AND FINANCIAL PLANNING FULL DETAILS HERE PRN GNT

AP News: ఏపీ ప్రభుత్వంతో చేతులు కలిపిన నోబెల్ గ్రహీత.. సుస్థిర ఆర్ధికాభివృద్ధే లక్ష్యమన్న సర్కార్..

సీఎం జగన్ తో ఎస్తర్ డఫ్లో భేటీ

సీఎం జగన్ తో ఎస్తర్ డఫ్లో భేటీ

సుస్థిర ఆర్ధిక ప్రగతి కోసం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ప్రఖ్యాత ఆర్ధికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత ఎస్తర్ డఫ్లో ప్రకటించారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎస్త్ డప్లో బృందం.. సీఎం జగన్ (AP CM YS Jagan) తో భేటీ అయింది.

ఇంకా చదవండి ...
    సుస్థిర ఆర్ధిక ప్రగతి కోసం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ప్రఖ్యాత ఆర్ధికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత ఎస్తర్ డఫ్లో (Esther Duflo) ప్రకటించారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎస్త్ డప్లో బృందం.. సీఎం జగన్ (AP CM YS Jagan) తో భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గృహనిర్మాణం, మహిళా సాధికారిత అంశాల్లో ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలను, అమలు చేస్తున్న కార్యక్రమాలను, పథకాలను ఎస్తర్‌ డఫ్లో బృందానికి సీఎం వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఎస్తర్ డఫ్లో అభినందించారు. ప్రభుత్వ పథకాలన్నీ ఓ గదిలో కూర్చొని రూపొందించలేదని.. పాదయాత్రలో సీఎం క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని అర్థంచేసుకుని ప్రభుత్వ పథకాలన్నీ రూపొందించారన్నారు.

    అర్హులు ఎవ్వరూ మిగిలిపోకూడదంటూ ముఖ్యమంత్రి తీసుకుంటున్న చొరవ.. అనేది, ఆయన గొప్ప ఆలోచనా దృక్పథాన్ని వెల్లడిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. పేదరికాన్ని నిర్మూలించాలనే ఆయన అంకితభావాన్ని వెల్లడిస్తోందన్నారు. డీబీటీ స్కీంల్లో అధికభాగం నేరుగా మహిళల ఖాతాల్లోకి వేయడం, అలాగే గృహనిర్మాణంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం అన్నది.. కేవలం మహిళా సాధికారికతకే కాదు.. దీనివల్ల అన్నిరకాలుగా కుటంబం సుస్థిరమవుతుందని ఎస్తర్ అభిప్రాయపడ్డారు.

    ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్ విషయంలో టీడీపీకి మరో ఆప్షన్ లేదా..? ఆర్ఆర్ఆర్ హిట్ తర్వాత మారిన లెక్కలు..!


    సుదీర్ఘ పాదయాత్ర చేసిన సీఎం.. పేదల కష్టాలను పరిగణలోకి తీసుకొని పథకాలు పెట్టారు కాబట్టి... ఏం చేయాలన్నదానిపై మేం పెద్దగా దృష్టిపెట్టాల్సిన అవసరం లేదని.., కాకపోతే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి.. వాటి బలోపేతం కోసం సలహాలు సూచనలు చేస్తామని స్పష్టం చేశారు. వివిధ అంశాలపై భవిష్యత్తులో సీఎంతో కలిసి పనిచేయడంపైనా మేం దృష్టిపెడుతున్నామన్న ఎస్తర్.. పేదరికాన్ని నిర్మూలించి ప్రజల జీవన స్థితిగతులను పెంచడమనే లక్ష్యసాధనలో వారితో కలిసి పనిచేస్తామన్నారు. వివిధ అంశాలపై ముఖ్యమంత్రికున్న పరిజ్ఞానం మమ్మల్ని ఆకట్టుకుందని.., గడచిన 15 ఏళ్లుగా వివిధరంగాల్లో జె–పాల్‌ పనిచేస్తోందని.., 20 రాష్ట్రాల్లో పనిచేస్తున్నామన్నారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్‌లో పైలట్‌ప్రాజెక్టు కింద కొన్ని అంశాల్లో పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

    ఇది చదవండి: గౌతమ్ రెడ్డిని తల్చుకొని ఎమోషనల్ అయిన జగన్.. ఆనాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న సీఎం..


    ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాలకు సంబంధించిన వివరాలను సీఎస్ సమీర్ శర్మ.. ఎస్తర్ బృందానికి అందజేశారు. లక్ష్యాలను చేరుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సమావేశంలో ఎస్తర్‌ డఫ్లోతో పాటు ఆమె బృంద సభ్యులు శోభిని ముఖర్జీ, కపిల్‌ విశ్వనాథన్, అపర్ణ కృష్ణన్, కునాల్‌ శర్మతో పాటు చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap government

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు