• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • NO SUPPORT FOR SENIOR IPS OFFICER AB VENKATESWARA RAO FROM IPS OFFICERS ASSOCIATION ANDHRA PRADESH PRN

Andhra Pradesh: ఏబీకి ఏదీ కలిసి రావడం లేదా..? ఈ సారి సహచరుల నుంచే షాక్..!

Andhra Pradesh: ఏబీకి ఏదీ కలిసి రావడం లేదా..? ఈ సారి సహచరుల నుంచే షాక్..!

ఏబీ వెంకటేశ్వరరావు(ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు (IPS AB venkateswara Rao) కు ఇటీవల ఏదీ కలిసిరావడం లేదు. ఈ సారి సహచర వర్గం నుంచే మద్దతు కరువైంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్  సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఇటీవల ఏదీ కలిసి రావడం లేదు. అవినీతి ఆరోపణల నుంచి బయటపడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు.ఇప్పటికే అరెస్ట్ భయంతో హై కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న ఆయనకు తాజాగా ఐపీఎస్ అధికారుల సంఘం షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్నం తనపై కక్ష సాధింపుకు పాల్పడుతోందని.. తప్పుడు ఆరోపణలో వేధిస్తోందని ఈ విషయంలో తనకు మద్దతు తెలపాలని ఏబీ వెంకటేశ్వరరావు ఇటీవల ఐపీఎస్ అధికారుల సంఘానికి లేఖ రాశారు. ఇటీవల సమావేశమైన ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖపై సీరియస్ గా చర్చించింది. ఐతే ఆయనపై ప్రభుత్వ చర్యలు సరైనవేనని., అసోసియేషన్ సభ్యులు అభిప్రాయపడ్డారు. అలాగే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నందున విచారణ ఎదుర్కోవడం తప్పనిసరి స్పష్టం చేసింది.

    ఇక ఈ వ్యవహారంలో ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎలాంటి జోక్యం చేసుకోబోదని తేల్చి చెపిపంది. అలాగే ఏబీకి మద్దతిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖంచిండింది. అలాగే తమ నుంచి మద్దతు లభించలేదన్న కోపంతో ఐపీఎస్ అధికారులపై ఎలాంటి ఆరోపణలు చేయకూడదని ఏబీ వెంకటేశ్వరరావుకు స్పష్టం చేసింది. మరోవైపు రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏబీని సస్పెండ్ చేయడానికి స్పష్టమైన ఆధారాలున్నట్లు గతంలోనే కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. అలాగే సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేయాలన్న పిటిషన్ ను కూడా కొట్టేసింది. ఆ తర్వాత నేపథ్యంలో సస్పెన్షన్‌పై ఏపీ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోగా.. కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇదిలా ఉంటే తన అరెస్టుకు ప్రభుత్వం యత్నిస్తోందని..., ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఏబీ వెంకటేశ్వరరావు ఇటీవలే హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం రెండు వారాల పాటు స్టే ఇచ్చింది. ఈ నెల 18లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ అదే తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.

    వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకతో ఏబీకి చిక్కులు
    2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గెలిచిన వెంటనే ఏబీ వెంకటేశ్వరరావును టార్గెట్ చేసింది. 2017-18లో పోలీసు శాఖ ఆధునికీకరణ కోసం టీడీపీ ప్రభుత్వం భద్రతా పరికరాలు కొనుగోలు చేసిన వ్యవహారంలో ఏబీ అక్రమాలకు పాల్పడ్డట్లు ప్రభుత్వం ఆరోపించింది. పరికరాల కొనుగోలు కాంట్రాక్టును ఇంజ్రాయిల్ కు చెందిన ఆర్టీ ఇన్ ఫ్లాటబుల్ ఆబ్జెక్ట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థకు దక్కెలా చేయడమే కాకుండా, అదే సంస్థకు తన కుమారుడు ఇండియాప్రతినిథిగా ఉన్న సంగతిని దాచి పెట్టింది. ఈ విధంగా తన కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంస్థకు ప్రయోజనం చేకూర్చారని ఏబీవై ఆరోపణలున్నాయి. అంతేకాకుండా టెండర్ల ప్రక్రియలో ప్రభుత్వ మార్గదర్శకాలను తొక్కిపెట్టారన్న అభియోగాలు కూడా ఉన్నాయి. ఏబీ వెంకటేశ్వరరావు ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఉన్న సమయంలో నిఘా పరికరాలను ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసేందుకు వినియోగించారని అప్పట్లో వైసీపీ ఆరోపించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసింది. రక్షణ పరికరాల కొనుగోలు అంశంలో నిబంధనలు పాటించకుండా దేశద్రోహానికి పాల్పడ్డారని కూడా ఆరోపించింది.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు