తిరుమల లడ్డూపై తియ్యటి వార్త చెప్పిన వైవీ సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ధరలు పెంచబోమని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. లడ్డూ ధరలు పెంచకూడదని నిర్ణయించామన్నారు.

news18-telugu
Updated: November 17, 2019, 5:04 PM IST
తిరుమల లడ్డూపై తియ్యటి వార్త చెప్పిన వైవీ సుబ్బారెడ్డి
లడ్డూ ప్రసాదం
  • Share this:
తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ధరలు పెంచబోమని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. లడ్డూ ధరలు పెంచకూడదని నిర్ణయించామన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే నిర్ణయాలు టీటీడీ తీసుకోదని స్పష్టం చేశారు. అతిథి గృహాల అద్దెపెంపు త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. చెన్నైలో శ్రీవారి ఆలయానికి తమిళ ప్రభుత్వం స్థలం కేటాయించిందన్నారు. ఆగమశాస్త్రాల అనుగుణంగా ఆలయ నిర్మాణానికి అనుకూలమా లేదా అనే విషయం త్వరలో నిర్ణయిస్తామని పేర్కొన్నారు. ఇటీవల టీటీడీ అధికారులు సమావేశమై... ప్రస్తుతం రూ.25గా ఉన్న లడ్డూ ధరను రూ.50కి పెంచాలని నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై పెద్ద దుమారం రేగింది. తిరుమల శ్రీవారి తర్వాత భక్తులు అత్యంత ఎక్కువగా ఇష్టపడేది లడ్డూ ప్రసాదాన్నే. అలాంటి ప్రసాదాన్ని ఏకంగా వంద శాతం పెంచేసి.. రూ.50 చేయాలనుకోవడాన్ని భక్తులు తప్పుపట్టారు. ఈక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. లడ్డూ ధరలు పెంపు వార్తలను ఖండించారు.

First published: November 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>