• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • NO NEW YEAR CELEBRATIONS ALLOWED IN VIJAYAWADA SAYS CP BATTINA SRINIVASULU BA

Vijayawada News: విజయవాడ వాసులకు బ్యాడ్ న్యూస్..

Vijayawada News: విజయవాడ వాసులకు బ్యాడ్ న్యూస్..

విజయవాడ బోర్డు

విజయవాడ వాసులకు బ్యాడ్ న్యూస్. ఈ సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలు లేనట్టే. ఎలాంటి న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. విజయవాడలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతులు లేవని నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు వెల్లడించారు.

  • Share this:
    విజయవాడ వాసులకు బ్యాడ్ న్యూస్. ఈ సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలు లేనట్టే. ఎలాంటి న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. విజయవాడలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతులు లేవని నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు వెల్లడించారు. ఇంట్లోనే కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని నగర ప్రజలకు సూచించారు. ప్రతి ఏడాది విజయవాడ నగరం కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతాయి. వీధులన్నీ విద్యుత్ కాంతులతో, యువత కేరింతలు, వేడుకలతో బెజవాడ వీధుల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. అయితే రాష్ట్రంలో కొవిడ్‌ రెండో దశ, కరోనా కొత్త రకం స్ట్రెయిన్‌ వ్యాప్తి దృష్ట్యా న్యూ ఇయర్ వేడుకలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ బత్తిన శ్రీనివాసులు చెప్పారు. ఇందులో భాగంగా నగరంలోని బందరు రోడ్డులో జనాలు గుమిగూడడం, రోడ్లపై కేక్‌ కోయడం లాంటివి నిషేధించినట్లు తెలిపారు. ఈ నెల 31వ తేదీన రాత్రి 10 గంటల్లోగా నగరంలోని వ్యాపార సంస్థలు, దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, ఇతర సంస్థల్లోనూ ఎలాంటి వేడుకలను నిర్వహించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు.

    ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న యూకేలోని కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ ఆంధ్రప్రదేశ్‌కు కూడా పాకింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ హెల్త్ కమిషనర్ ధ్రువీకరించారు. ఇటీవల ఓ మహిళ యూకే నుంచి భారత్ వచ్చింది. ఆమెను ఢిల్లీలోని క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. అయితే, అక్కడి నుంచి ఆమె తప్పించుకుని రైల్లో రాజమండ్రి వెళ్లింది. చివరకు ఆమెను కనుగొన్న అధికారులు ఐసోలేషన్‌లో ఉంచారు. ఆ మహిళకు యూకేలో ఉన్న కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ ఉన్నట్టు గుర్తించారు. ‘ఇటీవల యూకే నుంచి వచ్చి ఢిల్లీలో ఐసోలేషన్ కేంద్రం నుంచి తప్పించుకుని ప్రత్యేక రైల్లో రాజమండ్రికి చేరుకున్న ఆంగ్లో ఇండియన్ మహిళకు యూకే కరోనా స్ట్రెయిన్ ఉంది. అయితే, ఆమె నుంచి ఎవరికీ సోకలేదు.’ అని ఏపీ హెల్త్ కమిషనర్ చెప్పారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు