ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులపై జగన్‌కు షాక్...

ఎలక్ట్రిక్ బస్సులు నడపడానికి అవసరమైన సాంకేతికత ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఇలాంటి సమయంలో ఎలక్ట్రిక్ బస్సులను లీజుకు తీసుకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

news18-telugu
Updated: December 15, 2019, 6:48 PM IST
ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులపై జగన్‌కు షాక్...
ఏపీ సీఎం జగన్
  • Share this:
ఏపీఎస్ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల అంశంపై సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రభుత్వం నియమించిన జ్యుడీషియల్ కమిటీ షాక్ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి ఎలక్ట్రిక్ బస్సుల అవసరం లేదని సూచించింది. ఎలక్ట్రిక్ బస్సుల టెండర్లపై రిటైర్డ్ న్యాయమూర్తి జిస్టిస్ బి.శంకర్‌రావు నేతృత్వంలోని ప్రివ్యూ కమిషన్ స్పష్టం చేసింది. ఏపీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. 350 బస్సులను లీజుకు తీసుకోవాలని భావించింది. ఈ టెండర్ విలువ రూ.100 కోట్ల పైగా ఉండడంతో ప్రభుత్వం దీన్ని జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్‌కు పంపింది. ఈ అంశంపై ఆన్‌లైన్‌లో కూడా ప్రజల అభిప్రాయాలను కమిటీ పరిశీలించింది. కమిషన్ సొంతంగా అధ్యయనం చేసింది. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులు నడపాల్సిన అవసరం లేదని కమిషన్ స్పష్టం చేసింది.

ఎలక్ట్రిక్ బస్సులు నడపడానికి అవసరమైన సాంకేతికత ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఇలాంటి సమయంలో ఎలక్ట్రిక్ బస్సులను లీజుకు తీసుకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో డీజిల్ బస్సులు నడపడమే మంచిదని జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్ సిఫారసు చేసింది. ఒక్కో ఎలక్ట్రిక్ బస్సుకు రూ.45 లక్షలు రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం భావించడం కూడా అర్థరహితమని అభిప్రాయపడినట్టు తెలిసింది. రాష్ట్రం ఆర్థికంగా కుదేలైన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం రూ.150 కోట్లకు పైగా రాయితీలు చెల్లించడం తెలివైన నిర్ణయం కాదని అభిప్రాయపడింది.

First published: December 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>