Home /News /andhra-pradesh /

Andhra Pradesh: అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు వద్దు.. గవర్నర్‌కు ఉద్యోగుల రిక్వెస్ట్

Andhra Pradesh: అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు వద్దు.. గవర్నర్‌కు ఉద్యోగుల రిక్వెస్ట్

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (ఫైల్ ఫోటో)

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: ఎన్నికల ప్రక్రియ ఒకరోజులో అయ్యేది కాదని.. లక్ష నలభైవేల పోలీస్ స్టేషన్లు పరిశీలించాలని అన్నారు. బ్యాలెట్ బాక్సులు, సరంజామా మొత్తం తీసుకోవాలని.. ఎవరైనా, ఎక్కడైనా కరోనా బారిన పడవచ్చని ఏపీ అమరావతి ఉద్యోగుల సంఘం జెఏసీ చైర్మన్, బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

ఇంకా చదవండి ...
  స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే కుదరదని అన్నప్పుడు ఎస్ఈసీ ఎందుకు పంతం పడుతున్నారో చెప్పాలని ఏపీ అమరావతి ఉద్యోగుల సంఘం జెఏసీ చైర్మన్, బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో వ్యాక్సిన్ రెండు డోసులు ఇస్తే కానీ పని చేయదు అని శాస్త్రవేత్తలే చెప్పారని అన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ ప్రతీ ఉద్యోగికి అందే వరకూ ఎన్నికలు జరగకుండా చూడాలని గవర్నర్‌ను కోరినట్టు ఆయన తెలిపారు. గవర్నర్ విచక్షణ అధికారాలతో ఈ అంశాన్ని పరిశీలించాలని కోరామని.. ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. పంచాయితీ ఎన్నికల నిర్వహణపై అభ్యంతరాలను 7 పేజీల లేఖలో సమర్పించామని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

  ప్రభుత్వ ఉద్యోగులుగా ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉన్నామని.. కరోనాని ఎదుర్కొన్న ఘనత ప్రభుత్వ ఉద్యోగులదే అని బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రభుత్వ అభ్యర్ధనను వ్యతిరేకించి ఎన్నికల నిర్వహణకు సిద్ధపడటం జీర్ణించుకోలేకపోయామని అన్నారు. ఎన్నికల ప్రక్రియ ఒకరోజులో అయ్యేది కాదని.. లక్ష నలభైవేల పోలీస్ స్టేషన్లు పరిశీలించాలని అన్నారు. బ్యాలెట్ బాక్సులు, సరంజామా మొత్తం తీసుకోవాలని.. ఎవరైనా, ఎక్కడైనా కరోనా బారిన పడవచ్చని అన్నారు. పోలింగ్ తరువాత కూడా కోవిడ్ సమస్య రావచ్చని తెలిపారు. ఇందుకోసం నాలుగు లక్షల పీపీఈ కిట్లు ఎలా తెస్తారని ప్రశ్నించారు.

  తెలంగాణాలో మునిసిపల్ ఎన్నికలు జరిపితే ముప్ఫై శాతం ఓటింగ్ దాటలేదని.. పంచాయితీ ఎన్నికలంటే వందశాతం పోలింగ్ ఆశిస్తారని బొప్పరాజు వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. ప్రజలకు ఎన్నికల అవేర్నెస్ ఎంత ఇచ్చినా భయాందోళనలలో ఉన్నారని.. రెండు మూడు లక్షల సిబ్బంది ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారని తెలిపారు. అసలు 2018 నుంచీ ఎన్నికలు జరపకుండా ఇప్పుడెలా జరుపుతారని అన్నారు. ఎన్నికల కమీషన్ పంతానికీ.. మా ప్రాణాలను పణంగా పెడతారా అని ప్రశ్నించారు. హైకోర్టులో నోటిఫికేషన్ సస్పెండ్ అయినా వదలకుండా ఎస్ఈసీ డివిజన్ బెంచ్ కు వెళ్ళారని.. ఎస్ఈసీకి ఇంత పంతం అవసరమా ? అని ప్రశ్నించారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, AP governor viswabhushan, Ap local body elections

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు