హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Amaravati: అమరావతిపై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Amaravati: అమరావతిపై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Kodali Nani on Amaravati: అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని కొడాలి నాని ప్రకటనలో పేర్కొనడం సంచలనంగా మారింది.

  ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వం... అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలని నిర్ణయించింది. విశాఖను పరిపాలన రాజధానిగా మార్చుతామని ప్రకటించిన సీఎం జగన్.. శాసనసభ, శాసన మండలి అమరావతిలోనే కొనసాగుతాయని స్పష్టం చేశారు. అయితే విపక్షాలు మాత్రం ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ మంత్రి కొడాలి నాని కార్యాలయం నుంచి వచ్చిన ఓ ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని కొడాలి నాని ఆ ప్రకటనలో పేర్కొనడం సంచలనంగా మారింది.

  దీనిపై సీఎం జగన్ చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారని ఆయన తెలిపారు. అన్ని పక్షాలతో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకుందామని సీఎం జగన్ అన్నట్టు వెల్లడించారు. చంద్రబాబుకు ఎమ్మెల్యేల బలం లేదని.. ఉన్నవారు కూడా జారిపోతున్నారని కొడాలి నాని అన్నారు. లోకేశ్‌ను ఎమ్మెల్యే చేయడం ఎవరి వల్లా కాదని ఆరోపించారు. ఏపీ గ్రీన్ కార్పొరేషన్ రూ. 30 వేల కోట్లతో తెస్తున్నామని తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇద్దామని అంటే కోర్టుకు వెళ్లి స్టే తేవడం విడ్డూరమని కొడాలి నాని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Amaravati, Andhra Pradesh, Kodali Nani

  ఉత్తమ కథలు