Home /News /andhra-pradesh /

NO JAGAN CAMPAIGN IN BADVEL BY ELECTION AS AP CM WRITES LETTERS TO EACH OTHER URGING SUPPORT TO YSRCP CANDIDATE MKS

badvel bypoll: సీఎం జగన్ అనూహ్య నిర్ణయం -kcr తీరుకు భిన్నంగా -ఆ రెండూ ఎస్సీ రిజర్వుడు స్థానాలే

బద్వేల్ బైపోల్

బద్వేల్ బైపోల్

రెండు చోట్లా జరిగేవి ఉప ఎన్నికలే.. ఆంక్షలు విధించిన ఈసీ కూడా ఒకటే.. అయితే అధినేతల రియాక్షన్లు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. సొంత జిల్లా కడపలోని బద్వేల్ అసెంబ్లీ బైపోల్ ప్రచారంపై ఏపీ సీఎం జగన్ ఒకలా స్పందిస్తే, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోలా ఫైరయ్యారు..

ఇంకా చదవండి ...
కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ రిజర్వుడు స్థానమైన బద్వేల్ లో ఉప ఎన్నిక ప్రచారానికి ఆయన పోవడం లేదు. గతంలోనూ ఎస్సీ స్థానమైన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారానికి జగన్ దూరంగా ఉన్నారు. రెండు సందర్భాల్లోనూ ప్రచారానికి వెళ్లకపోవడానికి కరోనానే కారణంగా పేర్కొన్నారు. సీఎం జగన్ అడుగుపెట్టకుండానే తిరుపతి పార్లమెంట్ సీటును గెలుచుకున్న వైసీపీ.. ఇప్పుడు బద్వేల్ అసెంబ్లీ సీటును కూడా నిలుపుకొంటుందని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. కాగా, ప్రచారానికి రాలేకపోతున్నానని, వైసీపీ అభ్యర్థికే ఓటేయాలని అర్థిస్తూ సీఎం జగన్ బద్వేల్ ఓటర్లకు పేరుపేరునా లేఖలు పంపుతున్నారు..

కరోనా నేపథ్యంలో ఏపీలోని బద్వేల్, తెలంగాణలోని హుజూరాబాద్ లో భారీ బహిరంగ సభలకు ఎన్నికల సంఘం అనుమతివ్వలేదు. పలు పథకాలను కూడా నిలిపేశారు. ఇదే విషయంపై  తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్నటి టీఆర్ఎస్ ప్లీనరీలో మాట్లాడుతూ ఈసీని తిట్టిపోశారు. ఎన్నికల సంఘం పరిధి దాటి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దాదాపు అలాంటి ఆంక్షలే ఎదుర్కొంటున్నా, ఏపీ సీఎం జగన్ మాత్రం ఈసీని పల్లెత్తు మాట అనుకుండా, ప్రచారానికి రాలేకపోతున్నానంటూ ప్రజల్నే కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. నేరుగా ఎన్నికల ప్రచారానికి రావాలని మనుసులో ఉన్నా.. కొవిడ్ ప్రమాదం పొంచి ఉన్న కారణంగా లేఖల ద్వారా ఓట్లు అర్థిస్తున్నానని జగన్ పేర్కొన్నారు.

బద్వేల్ ఓటర్లకు రాసిన లేఖల్లో సీఎం జగన్ తాను అమలు చేస్తోన్న పథకాలను పదే పదే గుర్తుచేశారు. వైఎస్సార్‌ ఆసరా, జగనన్న అమ్మ ఒడి,జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ (డ్వాక్రా) పథకాలు అందరికీ అందుతున్నాయనే విశ్వాసం ఉందని, ఏపీలో ఇప్పుడున్నది ప్రజా ప్రభుత్వమని, చేస్తోన్న పనులకు దీవెనకరంగా బద్వేల్ లో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని సీఎం కోరారు.

కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కరోనాతో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. వైసీపీ తరఫున దివంగత సుబ్బయ్య సతీమణి దాసరి సుధ బరిలో ఉన్నారు. జనసేన మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా పుంతల సురేశ్, కాంగ్రెస్ గా అభ్యర్థి కమలమ్మ పోటీ పడుతున్నారు. టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో బీజేపీ బద్వేల్ పై గట్టి ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలువురు కీలక నేతలను ప్రచారంలోకి దింపింది. వైసీపీ ప్రచారం మొత్తాన్ని ఎన్నికల ఇంచార్జి అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే పర్యవేక్షిస్తున్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోన్న వైసీపీ.. సీఎం జగన్ ప్రచారానికి వస్తే మెజార్టీ పెరుగుతుందని ఆశించింది. కానీ ముఖ్యమంత్రి మాత్రం లేఖల ప్రచారానికే పరిమితమైపోయారు.
Published by:Madhu Kota
First published:

Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap cm jagan, Kadapa, Ysrcp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు