YS Jagan: సీఎం జగన్ కు కోర్టు షాక్..! అందుకు ఒప్పుకునేది లేదన్న ధర్మాసనం..!

YS Jagan: సీఎం జగన్ కు కోర్టు షాక్..! అందుకు ఒప్పుకునేది లేదన్న ధర్మాసనం..!

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jaganmohanreddy)ని అక్రమాస్తుల కేసులో షాక్ లు తప్పడం లేదు. కొవిడ్ కారణంగా కోర్టుకు ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు లభించినా.., ఇటీవలే విచారణకు రావాల్సిందేనని స్పెషల్ కోర్టు ఆదేశించింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అక్రమాస్తుల కేసులో షాక్ లు తప్పడం లేదు. కొవిడ్ కారణంగా కోర్టుకు ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు లభించినా.., ఇటీవలే విచారణకు రావాల్సిందేనని స్పెషల్ కోర్టు ఆదేశించింది. ఇవాళ జరిగిన విచారణకు అమఒడి కారణంగా మినహాయింపు లభించినా.. కోర్టు విచారణలో మాత్రం ఊరట దక్కలేదు. విచారణ విషయంలో జగన్ చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టేసింది.

    అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న సీఎం జగన్.. సీబీఐ, ఈడీ కేసులను ఒకేసారి విచారించాలన్న అభ్యర్థలను హైదరాబాద్ లోని ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈడీ నమోదు చేసిన అభియోగాలు, సీబీఐ నమోదు చేసిన అభియోగాలు వేర్వేరని ఈడీ స్పష్టం చేసింది. దీంతో స్పెషల్ కోర్టు ఈడీ వాదనతో ఏకీభవించింది. దీంతో ఈడీ కేసులను విడిగా విచారిస్తామన్న కోర్టు తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.

    2010లో సీబీఐ వైఎస్ జగన్ మీద అభియోగాలు నమోదు చేసింది. అప్పటి నుంచి విచారణ సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది. ఈ మధ్యలో జగన్ పై ఈడీ కేసులు కూడా నమోదయ్యాయి. తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినందున విచారణకు హాజరుకావడం కుదరదని.. అందువల్లో రెండు కేసులను కలిపి విచారించాలని జగన్ కోర్టుకు తెలిపారు. కానీ ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చిన ధర్మాసనం.., ఈడీ వాదనను సమర్ధించింది. ఇటు సీబీఐ, అటు ఈడీ నమోదు చేసిన కేసులు పూర్తిగా వేర్వురేని.., రెండింటిని విడివిడిగా దర్యాప్తు చేయాల్సినందున విచారణ కూడా అలాగే జరపాలని కోర్టు అభిప్రాయపడింది.

    ఇవాళ జరిగిన విచారణకు జగన్ తరపున లాయర్లు హాజరుకాగా.. నిందితులుగా ఉన్న వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, జగతి పబ్లికేషన్స్‌, జనని ఇన్‌ఫ్రా, హెటిరో డైరెక్టర్‌ ఎం.శ్రీనివాసరెడ్డి, హెటిరో డ్రగ్స్‌, హెటిరో ల్యాబ్స్‌, హెటిరో హెల్త్‌కేర్‌, అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి, అరబిందో ఫార్మా లిమిటెడ్‌, ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఎండీ శరత్‌చంద్రారెడ్డి తదితరులు విచారణకు హాజరయ్యారు.

    అక్రమాస్తుల వ్యవహారంలో అరబిందో, హెటిరో సంస్థలకు జరిగిన భూ కేటాయింపుల్లో అవినీతి జరిగిందన్న అభియోగాలతో ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ 2016లో నమోదు చేసిన కేసులో సీఎం జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే నాంపల్లి కోర్టులోని ఈ కేసును సీబీఐకి అప్పగించాలని జగన్ అభ్యర్థించారు. దీనితో ఈడీ అరబిందో, హెటిరోలకు భూకేటాయింపు చార్జిషీట్లు సీబీఐ కి బదిలీ చేసింది. సీఎం జగన్ కేసుల విషయంలో సీబీఐ సమర్పించిన ఛార్జిషీట్ల ఆధారంగానే ఈడీ ఇప్పటికే విచారణ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆరు అంశాలకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేసి ఛార్జి షీట్లను దాఖలు చేసింది. కేసులన్నీ ఒకే చోట విచారించాలన్న జగన్ వాదనను కోర్టు అంగీకరించినా.., విడివిడిగా విచారించే అంశంలో మాత్రం ఊరట లభించలేదు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు