నేడు విజయవాడ ప్రకాశం బ్యారేజీ మీద వీరికి మాత్రమే అనుమతి...

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ముట్టడికి వెళితే వారిపై అన్నిరకాల చర్యలు తీసుకుంటామని ఏపీ పోలీసులు స్పష్టం చేశారు.

news18-telugu
Updated: January 20, 2020, 5:05 AM IST
నేడు విజయవాడ ప్రకాశం బ్యారేజీ మీద వీరికి మాత్రమే అనుమతి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ముట్టడికి వెళితే వారిపై అన్నిరకాల చర్యలు తీసుకుంటామని ఏపీ పోలీసులు స్పష్టం చేశారు. నేడు ఏపీ అసెంబ్లీ ముట్టడికి అమరావతి జేఏసీ పిలుపునిచ్చింది. ఏపీ కేబినెట్ సమావేశం, అసెంబ్లీ సమావేశం కూడా నేడే ఉండడంతో భారీ ఎత్తున ఆందోళన తెలపాలని అమరావతి జేఏసీ నిర్ణయించింది. దీంతో సంబంధిత జేఏసీకి, రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముందస్తుగా నోటీసులు జారీ చేశామని ఓ ప్రకటనలో తెలిపారు. ఇవాళ ప్రకాశం బ్యారేజీ మీద కేవలం హైకోర్టుకు చెందిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, అసెంబ్లీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, సెక్రటేరియట్‌లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తారు. ఇతరులకు ప్రకాశం బ్యారేజీ మీద ప్రవేశం లేదని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు వ్యక్తులైనా, సంస్థలైనా, హింసను, వర్గాల మధ్య వైషమ్యాలు ప్రేరేపించే విధంగా టివిలో, సోషల్ మీడియా, న్యూస్ పేపర్, కరపత్రాలు ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా పిలుపునివ్వడం చట్టరిత్యా నేరమని, వారిపై నిఘా ఉందని పోలీసులు హెచ్చరించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు