
ప్రతీకాత్మక చిత్రం
అమరావతి పరిధిలోని గ్రామాల్లో పంచాయతీలలో ఎన్నికలు నిలిపివేయమని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు.
అమరావతి పరిధిలోని గ్రామాల్లో పంచాయతీలలో ఎన్నికలు నిలిపివేయమని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. ఎన్నికలు నిర్వహించని గ్రామ పంచాయతీల వివరాలను జిల్లాల వారీగా లేఖలో ప్రభుత్వం తరపున ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే మునిసిపాలిటీలు, కార్పొరేషన్, అర్బన్ డెవలోపమెంట్ అథారిటీలో పలు గ్రామ పంచాయతీలను ప్రభుత్వం విలీనం చేసిందని. అలాంటి గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారాదని ఎన్నికల కమిషన్ ను ఈ లేఖలో కోరారు. అమరావతి పరిధిలోని గ్రామాల్లో పంచాయతీలలో కూడా ఎన్నికలు నిలిపివేయమని ఆ లేఖలో కోరారు. అమరావతి క్యాపిటల్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినందున ఆయా గ్రామాల్లో పంచాయతీ, ఎంపిటిసి, జడ్పీటీసిలకు ఎన్నికలు నిర్వహించరాదని ఎన్నికల కమిషన్ ను కోరినట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది లేఖ రాశారు.
Published by:Krishna Adithya
First published:March 08, 2020, 23:51 IST