• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • NO DELIMITATION FOR ANDHRA AND TELANGANA FOR NOW CENTRE FORMED COMMISSION FOR NORTH EAST AND JAMMU AND KASHMIR BA

తెలుగు రాష్ట్రాలకు షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం...

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం జగన్

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో తెలుగు రాష్ట్రాలకు ఝలక్ ఇచ్చింది.

  • Share this:
    తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో తెలుగు రాష్ట్రాలకు ఝలక్ ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌ను విభజించినప్పుడు ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన చేయాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే, నియోజకవర్గాల పునర్విభజన కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. ఏపీలో 175 నియోజకవర్గాలను 225కు, తెలంగాణలో 119 నియోజకవర్గాలను 153కు పెంచడానికి ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను నిరాశకు గురిచేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, అసోం, నాగాలాండ్‌తో పాటు కొత్తగా విభజించిన జమ్మూకాశ్మీర్‌లో నియోజకవర్గాలను పునర్విభజించడానికి ఓ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే, పునర్విభజనచట్టంలో పేర్కొన్నట్టుగా ఏపీ, తెలంగాణలో మాత్రం నియోజకవర్గాల పునర్విభజనను పక్కనపెట్టింది. చంద్రబాబునాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గాల పునర్విభజన చేయాలంటూ పలుమార్లు కేంద్రాన్ని కోరారు. అయితే, కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పలుమార్లు కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. కానీ, ఫలితం లేకుండా పోయింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: