వాయుగుండం లేదు.. వర్షం లేదు.. తీవ్ర నిరాశ పరిచిన అల్పపీడనం

Weather Report: తీవ్రరూపం దాల్చిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి నైరుతి వైపు వంగితే ఒడిశా, తెలంగాణతో పాటు ఉత్తరాంధ్రలోనూ భారీ నుంచి మోస్తరు వర్షాలు పడతాయనుకున్నారు. అయితే, తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారకుండా మంగళవారం ఉదయానికే ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్‌ మీదకు వెళ్లిపోయినట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 3, 2019, 7:51 AM IST
వాయుగుండం లేదు.. వర్షం లేదు.. తీవ్ర నిరాశ పరిచిన అల్పపీడనం
ప్రతీకాత్మక చిత్రం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 3, 2019, 7:51 AM IST
అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా మారింది.. మరో 24 గంటల్లో అది వాయుగుండంగా మారుతుందని, ఇక వర్షాలే వర్షాలు అని ఆశపడ్డ ప్రజలకు తీవ్ర నిరాశ మిగిలింది. వాస్తవానికి, ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి సోమవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది మంగళవారానికి వాయుగుండంగా మారుతుందని అంచనా వేశారు. తీవ్రరూపం దాల్చిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి నైరుతి వైపు వంగితే ఒడిశా, తెలంగాణతో పాటు ఉత్తరాంధ్రలోనూ భారీ నుంచి మోస్తరు వర్షాలు పడతాయనుకున్నారు. అయితే, తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారకుండా మంగళవారం ఉదయానికే ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్‌ మీదకు వెళ్లిపోయినట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దాని ప్రభావం రాష్ట్రంలో ఏమీ లేదని, భారీ వర్ష సూచన లేనట్టేనని వెల్లడించారు. మరో అల్పపీడనం దాకా ఆగాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల మంగళవారం వర్షాలు కురిశాయి.

ఇదిలా ఉండగా, ఉత్తర తెలంగాణలో బుధవారం అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న రెండు రోజుల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

First published: July 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...