శ్రీశైలం డ్యాం పగుళ్లపై స్పందించిన ఏపీ సర్కారు..

నాగార్జునసాగర్ డ్యామ్

శ్రీశైలం డ్యాంకు పగుళ్లు ఏర్పడ్డాయని, ఆ డ్యాం ప్రమాదంలో ఉందన్న వాటర్‌మ్యాన్ రాజేంద్ర సింగ్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఆనకట్ట ప్రమాద స్థితిలో ఉందన్న వార్త అవాస్తవమని, డ్యాంకు ఎలాంటి పగుళ్లు లేవని స్పష్టం చేసింది.

  • Share this:
    శ్రీశైలం డ్యాంకు పగుళ్లు ఏర్పడ్డాయని, ఆ డ్యాం ప్రమాదంలో ఉందన్న వాటర్‌మ్యాన్ రాజేంద్ర సింగ్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఆనకట్ట ప్రమాద స్థితిలో ఉందన్న వార్త అవాస్తవమని, డ్యాంకు ఎలాంటి పగుళ్లు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీరు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా ప్రతి ఏడాది ఫ్లాంక్ ప్రొటెక్షన్ పనులు, గేట్ మెయింటెనెన్స్ పనులు, గ్యాలరీ నిర్వహణ పనులు శ్రద్ధతో చేపడతామని వివరించారు. ఈ ఏడాది కూడా మెయింటెనెన్స్‌కు సంబంధించి సర్వే చేశామని, ఆ రిపోర్టు రావాల్సి ఉందని తెలిపారు. ఆ రిపోర్టు అందగానే దానికనుగుణంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. డ్యాం అధికారులు ఎప్పటికప్పుడు డ్యాం సీపేజీ తదితరాలతో పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. దాన్ని బట్టి డ్యాంకు ఎలాంటి ముప్పు లేదని, ప్రస్తుతానికి సీస్మిక్ ప్రభావం లేదని స్పష్టం చేశారు. డ్యాం సాంకేతిక విషయమై అధికారుల సలహాలతో తగు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

    కాగా, గంగాజల్ సాక్షరతా యాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులను, నదులను సందర్శిస్తున్న వాటర్‌మ్యాన్ రాజేంద్ర సింగ్.. బుధవారం నాడు శ్రీశైలం డ్యాంను సందర్శించారు. ఈ సందర్భంగా డ్యాంను పరిశీలించగా.. ఆనకట్టకు అడ్డుగా పగుళ్లు ఏర్పడ్డాయని చెప్పారు. పగుళ్లు మరింత ఎక్కువైతే తెలుగు రాష్ట్రాలకు ఊహించని నష్టం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దాని ప్రభావానికి సగం ఏపీ మునిగిపోతుందని హెచ్చరించారు. జలాశయంలో ఓ భారీ గొయ్యి ఏర్పడుతోందని చెప్పారు. గతంలో నిర్మించిన డ్యాంలను, రిజర్వాయర్ల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: