పోలవరంలో అవినీతికి ఆధారాలు లేవన్న కేంద్రం.. టీడీపీకి బిగ్ రిలీఫ్

Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది.

news18-telugu
Updated: June 27, 2020, 6:16 PM IST
పోలవరంలో అవినీతికి ఆధారాలు లేవన్న కేంద్రం.. టీడీపీకి బిగ్ రిలీఫ్
పోలవరం ప్రాజెక్ట్ (ఫైల్ ఫోటో)
  • Share this:
పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విచారణ అవసరం లేదని తేల్చిచెప్పింది. పెంటపాటి పుల్లారావు అనే సామాజిక వేత్త ఫిర్యాదుకు స్పందించిన జలశక్తి శాఖ ఈ మేరకు సమాధానం ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని ప్రధాని వ్యాఖ్యలు చేశారన్న వ్యాఖ్యలను జలశక్తి శాఖ తోసిపుచ్చింది. ప్రధాని పోలవరంపై విచారణ జరపమని తమకు ఎక్కడా ఆదేశాలివ్వలేదని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన విచారణ కమిటీ నివేదికను వాళ్లే పక్కన పెట్టినట్లు కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. నిబంధనలకు అనుగుణంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోందని అదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని జలశక్తి శాఖ ప్రకటించింది. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటనతో ఏపీలో గతంలో అధికారంలో ఉన్న టీడీపీకి ఊరట లభించినట్టయ్యిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
First published: June 27, 2020, 5:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading