అదే తేదీ.. గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష మార్పు కుదరదన్న ఏపీపీఎస్సీ!

పరీక్ష వాయిదా పడటం వల్ల సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు నిరాశకు లోనయ్యే అవకాశం ఉందని ఏపీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. పరీక్ష వాయిదా వేస్తే ప్రత్యామ్నాయ తేదీలను నిర్ణయించడంలోనూ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని.. నియామక ప్రక్రియ కూడా ఆలస్యమవుతుందని అంటున్నారు.

news18-telugu
Updated: April 30, 2019, 9:21 AM IST
అదే తేదీ.. గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష మార్పు కుదరదన్న  ఏపీపీఎస్సీ!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు చేయకూడదని.. ముందుగా ప్రకటించినట్టు మే 5నే పరీక్ష నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నిర్ణయించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రిపరేషన్‌కు అవాంతరాలు ఏర్పడ్డాయని.. కాబట్టి పరీక్ష తేదీని వాయిదా వేయాలని కొంతమంది అభ్యర్థులు ఏపీపీఎస్సీ చైర్మన్‌కు, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి విజ్ఞప్తి చేశారు. అయితే పరీక్ష వాయిదా పడటం వల్ల సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు నిరాశకు లోనయ్యే అవకాశం ఉందని ఏపీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. పరీక్ష వాయిదా వేస్తే ప్రత్యామ్నాయ తేదీలను నిర్ణయించడంలోనూ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని.. నియామక ప్రక్రియ కూడా ఆలస్యమవుతుందని అంటున్నారు.

గ్రూప్‌–2 కింద 446 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 154 కాగా, మిగిలినవి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు. మే 5న నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 773 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓఎమ్మార్‌ విధానంలో పరీక్ష జరగనుంది. తప్పు సమాధానాలకు 1/3 నెగెటివ్‌ మార్కులు కూడా ఉంటాయి.


ఇక ప్రిలిమ్స్‌లో ఏపీపీఎస్సీ నిర్దేశించే కటాఫ్ మార్కులు సాధించినవారు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు. ఆయా సామాజిక వర్గాల రిజర్వేషన్ల ఆధారంగా 1:12 నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో ప్రతీ పేపర్ రాయాల్సి ఉంటుంది. రిజర్వ్డ్ కేటగిరీల నుంచి తగినంతమంది మెయిన్స్‌కు ఎంపిక కాకపోతే.. కటాఫ్ మార్కులను తగ్గించి ప్రత్యేక కటాఫ్ నిర్ణయిస్తారు.అయితే ఈ తరహాలో సివిల్స్‌కు ఎంపికయ్యేవారు రిజర్వ్డ్ కోటా పోస్టులకే పరిమితం అవాల్సి ఉంటుంది.

First published: April 30, 2019, 7:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading