హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Breast Cancer: ఏపీలో రొమ్ము క్యాన్సర్ పై సర్వే...షాకింగ్ విషయాలు వెల్లడి

Breast Cancer: ఏపీలో రొమ్ము క్యాన్సర్ పై సర్వే...షాకింగ్ విషయాలు వెల్లడి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) పై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో సంచలన నిజాలు వెల్లడయ్యాలు. క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన లేదని సర్వే స్పష్టం చేసింది.

ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు చాలా అవసరం. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా అది ప్రాణానికే ప్రమాదకరంగా పరిణమించ్చవచ్చు. శరీరంలో ఏదైనా మార్పును గమనిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి ట్రీట్ మెంట్ తీసుకోవడం ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన అంశం. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా మంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మనకేమవుతుందిలే అనే ధీమాతో బ్రతికేస్తున్నారు. అందుకే రాష్ట్రంలో క్యాన్సర్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహిళలను బ్రెస్ట్ క్యాన్సర్ కబళిస్తోంది. క్యాన్సర్ ను తొలిదశలో గుర్తించడం, వైద్యం తీసుకునే వారి సంఖ్య రాష్ట్రంలో చాలా తక్కువగా ఉంది. ఇటీవల కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ నిర్వహించిన సర్వేలో క్యాన్సర్ టెస్టులు చేయించుకునేవారి సంఖ్య రాష్ట్రంలో మరీ తక్కువగా ఉన్నట్లు తేలింది.

సర్వేలో సంచలన నిజాలు

రాష్ట్రంలో కేవలం 4.7శాతం మహిళలు మాత్రమే క్యాన్సర్ టెస్టులు చేయించుకున్నారు. నివావరణ చర్యలు తీసుకునేవారు 0.8% మంది మాత్రమే ఉన్నారు. నోటి క్యాన్సర్ పరీక్షలు చేయించుకునేవారిలో పురుషుల కంటే స్త్రీలే అధికంగా ఉన్నారు. ఈ జాబితాలో పురుషులు 6.3% ఉండగా., స్త్రీలు 7.3%గా ఉన్నారు. పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లోని స్త్రీలు బ్రెస్ట్ మరియు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ లో మెరుగ్గా ఉన్నారు. అదే నోటీ క్యాన్సర్ స్క్రీనింగ్ లో అర్బన్ ఏరియాలు ముందున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలకు గానూ 10 జిల్లాల్లోని బ్రెస్ట్ క్యాన్సర్ టెస్టులు చేయించుకున్న మహిళలు కనీసం ఒక్క శాతం కూడా లేరు. కృష్ణాజిల్లాలో 2.1%, పశ్చిమగోదావరి జిల్లాలో 1.8%, తూర్పు గోదావరి జిల్లాలో 1% మాత్రమే టెస్టులు చేయించుకున్నారు.

ఇక 6 జిల్లాలో మాత్రమే మహిళలు అధికంగా గర్భాశయ క్యాన్సర్ చికిత్స తీసుకున్నారు. కడప జిల్లాలో 13.4 శాతం, నెల్లూరులో 10.2 శాతం, పశ్చిమగోదావరిలో 7.1శాతం టెస్టులుచేయించుకున్నవారిలో ఉన్నారు. ఇక నోటి క్యాన్సర్ టెస్టులు చేయించుకునేవారిలో కేవలం 7 జిల్లాలు మాత్రమే మెరుగ్గా ఉన్నాయి. గుంటూరులో 14.6 శాతం, పశ్చిమగోదావరిలో 13.1శాతం, కృష్ణాజిల్లాలో 12.3శాతం టెస్టులు జరగ్గా.. కర్నూలు, కడప, శ్రీకాకుళం జిల్లాలు చివరి స్థానాల్లో ఉన్నాయి.

ప్రభుత్వాలు, వైద్యులు తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రజలు మాత్రం టెస్టులు చేయుంకోవడానికి వెనుకాడతున్నారు. ఇలా అయితే మహమ్మారి బారిన పడేవారి సంఖ్య అతి తక్కువ కాలంలోనే రెట్టింపవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Cancer, Health

ఉత్తమ కథలు