హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Union Budget: బడ్జెట్ లో పెట్రో కెమికల్స్ మాటేది..! ఉద్యోగ కల్పనలో ఏపికి‌ స్ధానం లేదా..!

Union Budget: బడ్జెట్ లో పెట్రో కెమికల్స్ మాటేది..! ఉద్యోగ కల్పనలో ఏపికి‌ స్ధానం లేదా..!

Union Budget 2022: తాజా కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ను తీవ్రంగా నిరాశ పరిచింది. విభజన హామీల ప్రస్తావన లేదు.. రైల్వే జోన్ సంగతే మరిచిపోయారు. ప్రత్యేక హోదా గురించి పట్టించుకోలేదు.. మరోవైపు కాకినాడ పెట్రో కెమికల్స్ ఊసుకూడా ఎత్తలేదు..

Union Budget 2022: తాజా కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ను తీవ్రంగా నిరాశ పరిచింది. విభజన హామీల ప్రస్తావన లేదు.. రైల్వే జోన్ సంగతే మరిచిపోయారు. ప్రత్యేక హోదా గురించి పట్టించుకోలేదు.. మరోవైపు కాకినాడ పెట్రో కెమికల్స్ ఊసుకూడా ఎత్తలేదు..

Union Budget 2022: తాజా కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ను తీవ్రంగా నిరాశ పరిచింది. విభజన హామీల ప్రస్తావన లేదు.. రైల్వే జోన్ సంగతే మరిచిపోయారు. ప్రత్యేక హోదా గురించి పట్టించుకోలేదు.. మరోవైపు కాకినాడ పెట్రో కెమికల్స్ ఊసుకూడా ఎత్తలేదు..

ఇంకా చదవండి ...

    P Anand Mohan, Visakhapatnam, News18.                      Union Budget 2022 - 2023:  మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన యూనియన్ బడ్జెట్ (Union Budget) పై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మరోసారి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను బడ్జెట్ తీవ్రంగా నిరాశ పరిచించింది.  అందుకే అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం (AP Government)తో సహా.. నిపుణులు చెప్పిన సూచనలు ఒక్కటికూడా కేంద్ర ప్రభుత్వం (Central Government) పట్టించుకోలేదు.   ప్రత్యేక హోదా సంగతి పక్కనబెట్టేసిన కేంద్రం.. రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పినా ఇంతవరకు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు మొదలుకాలేదు. వీటి సంగతి పక్కనబెడితే మరో కీలక హామీని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. అదే కాకినాడలో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటు. దీనిపై కేంద్రం కనీసం కన్నెత్తికూడ చూడటం లేదు.

    పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించి గత ప్రభుత్వం 2017లో గెయిల్, HPCLతో ఒప్పందం కుదుర్చుకుంది.  25వేల కోట్ల రూపాయలతో  పెట్రోకారిడార్ ఏర్పాటవుతుందని అంచనా వేశారు.  ప్రాజెక్టు పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చితే ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 50లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు చెప్పుకొచ్చారు. అలాగే రెండు మూడేళ్లలో పెట్రో కెమికల్ రంగంలో పెట్టుబడులు ఊపందుకుంటాయని ఈస్ట్ కోస్ట్ కారిడార్లో  25 వేల రూాపయల నుంచి  30 వేల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వస్తాయని.. అలాగే అనుబంధ సంస్థలను కలుపుకుంటే మొత్తం  2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది.

    ఇదీ చదవండి: ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్.. రేపు సెలవు ఇవ్వొద్దని ఆదేశాలు.. పీఆర్సీపై స్పందించిన సీఎం జగన్

    కాకినాడ సెజ్ లో 2వేల ఎకరాల భూమిని కూడా కేటాయించింది. ప్రాజెక్టు కోసం ప్రత్యేక కార్పొరేషన్ తో పాటు ఇతర పన్నుల కింద ప్రతి ఏటా రూ.975 కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీనిపై అప్పట్లో ఎలాంటి స్పందన రాలేదు. 2017 తర్వాత ఈ ప్రాజెక్టు ఏర్పాటు దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో పలుసార్లు చర్చలు జరిపినా ఫలితం లేదు.

    ఇదీ చదవండి: నిఘా నీడలో విజయవాడ.. పీఆర్సీ ర్యాలీ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు.. కఠిన ఆంక్షలు

    వయబిలిటీ గ్యాఫ్ ఫండింగ్ కింద 15 ఏళ్ల పాటు  975 కోట్ల రూపాయల చొప్పున ఇవ్వాలని రాష్ట్రం కోరినా కేంద్రం స్పందించలేదు. కేంద్రం పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం వయబులిటీ గ్యాప్ ఫండింగ్ నిధులను ఇచ్చేందుకు ముందుకొస్తేనే ఈ ప్రాజెక్టు ముందుకు కదులుతుందని కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరి ఇటీవల స్పష్టం చేశారు.

    ఇదీ చదవండి: ఐదేళ్లు కలిసే ఉన్నారు.. శారీరకంగా దగ్గరయ్యారు.. ఇప్పుడు మరో అమ్మాయితో పెళ్లి

    రాష్ట్రం నిధులిచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేయకపోవడం, కేంద్రం కూడా సీరియస్ గా స్పందించకపోవడంతో లక్షలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు రాష్ట్రానికి తలమానికంగా ఉండే ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది. కనీసం బడ్జెట్ లో కూడా కేంద్రం దీనిపై మాట్లాడకపోవడంతో ఇక ఆశలు ఆవిరయ్యాయి.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

    First published:

    Tags: Andhra Pradesh, AP News, Kakinada, Union Budget 2022

    ఉత్తమ కథలు