హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Union Budget 2022-23: ఆంధ్రప్రదేశ్ పై మరోసారి చిన్న చూపు.. కేంద్ర బడ్జెట్ లో తాజా కేటాయింపులు ఇవే..

Union Budget 2022-23: ఆంధ్రప్రదేశ్ పై మరోసారి చిన్న చూపు.. కేంద్ర బడ్జెట్ లో తాజా కేటాయింపులు ఇవే..

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మరోసారి నిరాశ

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మరోసారి నిరాశ

Union Budget 2022-23: మళ్లీ అదే సీన్ రిపీట్.. రాష్ట్ర విభజనతో పూర్తిగా నష్ట పోయిన ఆంధ్రప్రదేశ్ పై కేంద్ర వివక్ష కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం.. నిపుణులు ఇచ్చిన సూచనల ప్రస్తావన లేదు. విభజన హామీలు ఊసే లేదు.. మోదీ సర్కార్ ఇచ్చిన మాటలు కూడా వినపడలేదు.. ఓవరాల్ గా ఈ సారి కేంద్ర బడ్జెట్ ఏపీని తీవ్ర నిరాశపరిచింది. ఈ సారి బడ్జెట్ లో కేటాయింపులు ఇవే.

ఇంకా చదవండి ...

  Union Budget 2022-23: ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ మళ్లీ కొనసాగింది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (Central Finance Minster Nirmala Sitharaman) ఏపీ గురించి ఏదో ఒక మంచి మాట చెబుతారని అంతా ఆశగా ఎదురు చూడడం.. అసలు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రస్థావనే లేకుండా బడ్జెట్ ప్రంసంగం ముగియడం జరుగుతోంది. ప్రత్యేక హోదా (Special Status) ప్రస్తావన లేదు.. రైల్వే జోన్ (Railway Zone) ఊసే రాలేదు.. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) నిధుల కేటాయింపు గురించి మాట మాట్లాడలేదు.. విద్యాసంస్థల పరిస్థితి ఏంటి వివరించలేదు.. దీంతో మరోసారి ఏపీకి తీవ్ర నిరాశ తప్పలేదు.. కేంద్ర ప్రభుత్వం 2022–23 బడ్జెట్‌ను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్‌ను చిన్నచూపు చూసిందన్నది నిపుణులు మాట. అతి ముఖ్యమైన ప్రాజెక్టులకు సైతం ఆశించిన రీతిలో నిధులు కేటాయించకుండా అన్యాయం చేసింది. జాతీయ విద్యా సంస్థలు, ఇతర సంస్థలకు రిక్తహస్తం చూపింది. మొక్కుబడిగా సెంట్రల్‌ వర్సిటీ, గిరిజన వర్సిటీలకు కొద్ది మొత్తం నిధులు విదిల్చి.. తక్కిన సంస్థలకు ఎలాంటి కేటాయింపులు చేయక నిరాశపరిచింది. గతంలో ఆయా సంస్థలకు కనీసం లక్షల్లో అయినా కేటాయింపులు చూపేది.

  రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, సంస్థలకు కూడా నిధులను పెద్దగా ప్రతిపాదించలేదు. వారం రోజుల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన సన్నాహక(ప్రీబడ్జెట్‌ ) బడ్జెట్‌ భేటీ తరువాత వైసీపీ ఎంపీలు చెప్పిన అంశాల ప్రస్తావనే లేదు. ప్రత్యేక హోదా, పోలవరం సవరించిన అంచనా.. విభజన హామీల అమలు తదితర అంశాలపై బడ్జెట్‌ మంచి కబురే మోసుకువస్తుందని అనిపించింది. కానీ, ఆ అంశాలేవీ బడ్జెట్‌లో కనీసం ప్రస్తావనకూ నోచుకోకపోవడం గమనార్హం. ఇటీవల ప్రధాని మోదీని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వయంగా కలిసి సమర్పించిన వినతిపత్రంలోని విభజన సమస్యలను ప్రస్తావించారు. తాము ప్రతిపాదించిన అన్ని అంశాలకూ బడ్జెట్‌లో పరిష్కారం లభిస్తుంది అంటూ ప్రభుత్వం ఆశించింది.. కానీ వాటి ప్రస్తావనే బడ్జెట్ లో లేకపోవడం దారుణం.

  ఇదీ చదవండి : తొలిసారి కేంద్రం తీరుపై చంద్రబాబు అసహనం.. ఆ ఒక్క విషయంలో పొగడ్తలు

  ఏపీకి కేటాయింపులు ఇవే..

  పెట్రోయూనివర్సిటీకి(ఐఐపీఈ) రూ.150కోట్లు.

  విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌కు(వీపీటీ) రూ.207.99కోట్లు.

  రూ.10,000కోట్లు కేటాయించిన ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన పథకంలో మంగళగిరి ఎయిమ్స్‌కు చోటు.

  రూ.136.78కోట్లు ప్రతిపాదించిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్స్‌లో ఏపీకీ స్థానం.

  విజయవాడ నుంచి రాంచీతో పాటు పలు ఇతర రాష్ర్టాల రహదారి ప్రాజెక్టులకోసం రూ.353.03కోట్లు.

  తిరుపతి ఎస్వీ యూనివర్సిటీకి రూ.12లక్షలు.

  విదేశీ రుణాలతో విశాఖ నుంచి చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ తొలిదశ అభివృద్ధికి రూ.482.03కోట్లు.

  ఏపీలో 24గంటల విద్యుత్‌ సరఫరా పథ కం కింద రూ.298.92కోట్లు.

  ఏపీలో గ్రామీణ రహదారి ప్రాజెక్టుల కోసం రూ.1500కోట్లు.

  పట్టణ నీటి సరఫరా, మెరుగ్గా మురుగునీటి నిర్వహణ పథకం కోసం రూ.1200కోట్లు.

  సాగునీటిరంగంలో జీవనోపాధి వృద్ధి రెండో దశ ప్రాజెక్టు కోసం రూ.300కోట్లు.

  ఏపీ వ్యవసాయంలో సమగ్ర మార్పుల సాధన ప్రాజెక్టు కోసం రూ.150కోట్లు.

  ఏపీ ఆరోగ్య వ్యవస్థల పురోగతి ప్రాజెక్టుకు రూ.1000కోట్లు.

  ఏపీ రహదారులు, వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టులకోసం రూ.906.02కోట్లు.

  ఏపీ మండల, గ్రామ అనుసంధాన మెరుగుదల ప్రాజెక్టుకోసం 884.43కోట్లు.

  ఇదీ చదవండి : పోలవరం ప్రాజెక్టు మరింత లేట్.. కారణం ఏంటో తెలుసా..?

  కేంద్ర విద్యా సంస్థలకు మొండిచెయ్యి

  కేంద్ర బడ్జెట్లో రాష్ట్రంలోని జాతీయ విద్యా సంస్థలు, ఇతర సంస్థలకు రిక్తహస్తం చూపింది. మొక్కుబడిగా పెట్రోలియం, సెంట్రల్‌ వర్సిటీ, గిరిజన వర్సిటీలకు కొద్ది మొత్తం నిధులు విదిల్చింది. తక్కిన ఏ సంస్థకూ ఎలాంటి కేటాయింపులూ చేయలేదు. కనీసం గతంలో లక్షో, రెండు లక్షలో కేటాయింపులు చూపేది. ఈసారి బడ్జెట్లో ఆయా సంస్థల పేర్లు కూడా ప్రస్తావించ లేదు. అలాగే రాష్ట్ర విభజన చట్టం కింద ఏపీలో 7 జాతీయ విద్యా సంస్థలతో పాటు మరో 9 సంస్థలను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు అవుతున్నా, ఆయా సంస్థల పురోగతి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. ఆయా సంస్థలకు శాశ్వత భవనాల నిర్మాణానికి, బోధన, బోధనేతర అవసరాలకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనకు ఏటా సరైన విధంగా నిధుల కేటాయింపు కావడం లేదు. ఫలితంగా ఆయా సంస్థలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో కొలువుదీరలేదు.

  ఇదీ చదవండి : ఇక సమ్మె తప్పదు.. మంత్రుల కమిటీ పై ఉద్యోగ సంఘాల ఫైర్

  గతంతో పోల్చుకుంటే ఈ సారి బడ్జెట్ మరీ దారుణం. కనీసం బడ్జెట్లో ఆయా సంస్థల పేర్లు కూడా ప్రస్తావించలేదు. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్‌ విశాఖపట్నం రైల్వే జోన్‌ ఏర్పాటు అంశంపై ఈ ఏడాది కూడా ముఖం చాటేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించి ఈ ఏడాది శుభవార్తలు విందామనుకున్న ఐదు కోట్ల మంది ప్రజలను నిరాశ, నిస్పృహలకు గురిచేసింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ ఇంత దారుణంగా ఉంటుందని ఊహించలేదని వివిధ రంగాలకు చెందిన నిపుణులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Nirmala sitharaman, Union Budget 2022

  ఉత్తమ కథలు