హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Cyclone Nivar: దూసుకొస్తున్న తుఫాన్.. నివర్ గమనాన్ని లైవ్‌లో వీక్షించండి..

Cyclone Nivar: దూసుకొస్తున్న తుఫాన్.. నివర్ గమనాన్ని లైవ్‌లో వీక్షించండి..

ఇది రేపు ఉత్తర ఒడిశా, బెంగాల్‌ సాగర్‌ ఐలాండ్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు.(Image:Windy)

ఇది రేపు ఉత్తర ఒడిశా, బెంగాల్‌ సాగర్‌ ఐలాండ్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు.(Image:Windy)

Cyclone Nivar: ప్రస్తుతం నివర్ తుఫాన్ గంటకు 11 కి.మీ. వేగంతో ముందుకు కదులుతోంది. ఈ తుఫాన్ ఇవాళ అర్ధరాత్రి పుదుచ్చేరి సమీపంలోని కరైకాల్, మామల్లపురం మధ్య తీరం దాటే అవకాశముంది.

బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ 'నివర్' అలజడి సృష్టిస్తోంది. తూర్పు తీరంలో బీభత్సం సృష్టించేందుకు దూసుకొస్తోంది. నివర్ తుఫాన్ ధాటికి తమిళనాడుతో పాటు ఏపీలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, భీకర ఈదురు గాలులు వీస్తున్నాయి. ప్రస్తుతం తీవ్ర తుఫాన్‌గా ఉన్న నివర్.. ఇవాళ సాయంత్రం 5 గంటల తర్వాత పెను తుఫాన్‌గా బలపడనుంది. మధ్యాహ్నం 01.45కి ఐఎండీ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. నివర్ తుఫాన్ కడలూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 180 కి.మీ దూరంలో.. పుదుచ్చేరికి 190 కి.మీ. దూరంలో ఉంది. ఇక తమిళనాడు రాజధాని చెన్నైకి దక్షిణ ఆగ్నేయ దిశగా 250 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ALSO READ: Ind vs Aus: మ్యాచ్ లైవ్ వివరాలు... ఏ ఛానల్స్‌లో మ్యాచ్ చూడోచ్చంటే!

ప్రస్తుతం నివర్ తుఫాన్ గంటకు 11 కి.మీ. వేగంతో ముందుకు కదులుతోంది. ఈ తుఫాన్ ఇవాళ అర్ధరాత్రి పుదుచ్చేరి సమీపంలోని కరైకల్, మామల్లపురం మధ్య తీరం దాటే అవకాశముంది. తుఫాన్ తీరం దాటే సమయంలో భారీ వర్షాలతో పాటు భీకరమైన ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. గంటకు 120 నుంచి 145 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని హెచ్చరించింది.

నివర్ తుఫాన్ ప్రభావంతో ఇవాళ తమిళనాడులోని తంజావూరు, తిరువారూరు, నాగపట్టణం, కడలూరు, చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, మైలాదుతిరాయ్, అరియాలూర్, పెరంబలూరు, కల్లకుర్చి, విల్లుపురం, తిరువణ్ణామలై, పుదుచ్చేరి, కరైకల్ జిల్లాల్లతో పాటు ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు తమిళనాడులోని రాణిపేట్, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, వేలూరు జిల్లాలతో పాటు ఏపీలోని చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

తుఫాన్ గమనాన్ని లైవ్‌లో ఇక్కడ చూడండి:

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ముందు చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నాయి. నివర్.. పెను తుఫాన్‌గానే తీరం దాటనుండడంతో... ఏ స్థాయిలో విధ్వంసం జరుగుతుందోనని ప్రజల్లో ఆందోళన నెలకొంది.

First published:

Tags: Bay of Bengal, Cyclone Nivar, Heavy Rains