NIRBHAYA CASE AGAINST TDP SENIOR LEADER EX MINISTER AYYANNAPATRUDU AK
టీడీపీ సీనియర్ నేతపై నిర్భయ కేసు
అప్పట్లో ఎంపీలు పార్లమెంట్లో చేసిన పోరాటాన్ని స్పూర్తిగా తీసుకోవాలని ఆయన పార్టీ నేతలకు చెప్పినట్టు సమాచారం. అయితే అమరావతి విషయంలో చంద్రబాబు వ్యూహాన్ని అమలు చేసేందుకు టీడీపీ నేతలు అంత సుముఖంగా లేరనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ఏపీలో టీడీపీ సీనియర్ నేతపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు.
మరో టీడీపీ సీనియర్ నేతపై కేసు నమోదైంది. మాజీమంత్రి, టీడీపీ ముఖ్యనేతల్లో ఒకరైన అయ్యన్నపాత్రుడుపై విశాఖ జిల్లా పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తనను ఉద్దేశించి అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కృష్ణవేణి మంగళవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయ్యన్నపాత్రుడు తాత, మాజీ ఎమ్మెల్సీ రుత్తల లచ్చాపాత్రుడు ఫోటో మున్సిపల్ కార్యాలయం నుంచి తొలగించారంటూ గవిరెడ్డి వెంకటరమణ సారధ్యంలో సోమవారం ఉదయం అనుమతి లేకుండా బహిరంగ సమావేశం నిర్వహించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమావేశంలోనే అయ్యన్నపాత్రుడు తనను అవమానపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడుపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మాజీమంత్రి అయ్యన్నపాత్రుడుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.