హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Niranjan Reddy S : రాజ్యసభకు నామినేట్ అయిన ‘ఆచార్య’ నిర్మాత నిరంజన్ రెడ్డి గురించి ఈ విషయాలు తెలుసా..

Niranjan Reddy S : రాజ్యసభకు నామినేట్ అయిన ‘ఆచార్య’ నిర్మాత నిరంజన్ రెడ్డి గురించి ఈ విషయాలు తెలుసా..

రాజ్యసభకు నామినేట్ అయిన ఆచార్య నిర్మాత నిరంజన్ రెడ్డి (Twitter/Photo)

రాజ్యసభకు నామినేట్ అయిన ఆచార్య నిర్మాత నిరంజన్ రెడ్డి (Twitter/Photo)

Niranjan Reddy S As Rajya Sabha MP | ఎన్నో సుధీర్ఘ కసరత్తుల తర్వాత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ తరుపున నలుగురును రాజ్యసభకు నామినేట్ చేశారు. అందులో ప్రముక న్యాయవాది, ఆచార్య నిర్మాత నిరంజన్ రెడ్డి ఉండటం సర్వత్రా ఆసక్తి రేకిత్తోస్తోంది. రీసెంట్‌గా ఈయన ఆచార్య సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

ఇంకా చదవండి ...

Niranjan Reddy S As Rajya Sabha : సుదీర్ఘ కసరత్తు తరువాత ఆంధ్ర ప్రదేశ్  నుంచి నలుగురు  రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. ప్రస్తుతం ఖాళీ అవుతున్న స్థానాల్లో.. ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy)ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక మిగిలిన మూడు స్థానాల్లో.. ఇద్దరు బీసీ,  ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇచ్చారు.  విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) తో పాటు, ఆర్ కృష్ణయ్య (R Krishnaiah) , సీఎం జగన్ వ్యక్తిగత న్యాయవాది.. .మెగా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి (Niranjan Reddy), మరొకటి టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన బీద మస్తాన్ రావు (Beeda Masthan Rao) ల పేర్లను సీఎం ఫైనల్ చేశారు.

వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల (Sajjala), సుబ్బారెడ్డి (Subbareddy), విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) లతో సుదీర్ఘ భేటీ తరువాత ఈ నలుగుర్ని ఫైనల్ చేశారు సీఎం జగన్.. ఇక రీసెంట్‌గా చిరంజీవి, రామ్ చరణ్‌లతో కలిసి ఆచార్య సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డిది కూడా తెలంగాణలోని నిర్మల్ జిల్లా కావడం విశేషం. ఈయన గత 2011 నుంచి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై సీబీఐ నమోదు చేసిన ఆస్తులకు సంబంధించిన కేసులను వాదిస్తున్నారు. ఈయన 1970 జూలై 22 వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆ తర్వాత పూణేలోని సింబాయాసిస్ లా కాలేజీలో ఐదేళ్ల ‘లా’ కోర్సు చేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ లాయర్స్ ఒ. మనోహర్ రెడ్డి, కే.ప్రతాప్ రెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేశారు. 2016లో అప్పటి ఏపీ ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయవాది హోదాను కల్పించింది. అంతేకాదు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున స్పెషల్ సీనియర్ కౌన్సిల్‌గా సేవలు అందించారు.

RRR : రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ హిందీ డిజిటల్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆయన్ని ప్రభుత్వ న్యాయవాదిగా నియమించారు. ఈయన నిర్మాతగా పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఆచార్య సహా.. క్షణం, ఘాజీ, వైల్డ్ డాగ్‌తో పాటు అర్జున ఫల్గుణ వంటి పలు చిత్రాలను నిర్మించారు. ఈయనకు రాజయకీయాలతో పాటు సినిమాలపై ప్రత్యేక అభిమానం ఉంది. ఈ నేపథ్యంలో ఈయన పలు భారీ చిత్రాలను నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా తండ్రీ తనయులైన చిరంజీవి, రామ్ చరణ్‌లతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ఆచార్య’ సినిమా అనుకున్నంత రేంజ్‌లో మెప్పించలేక పోయింది. ఇక ఏపీ నుంచి రాజ్యసభకు సినీ నటుడు ఆలీని నామినేట్ చేస్తారనే ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో ఆలీని కాకుండా .. అటు రాజకీయ, సినీ రంగానికి చెందిన నిరంజన్ రెడ్డిని జగన్ రాజ్యసభకు నామినేట్ చేయడంతో నిరంజన్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు.

First published:

Tags: Acharya, Ap cm ys jagan mohan reddy, Niranjan Reddy, Rajya Sabha, Tollywood, Ysrcp

ఉత్తమ కథలు