Home /News /andhra-pradesh /

NIMMAGADDA RAMESH KUMAR SECRET MEETING WITH SUJANA CHOWDARY AND KAMINENI SRINIVASA RAO AK

బీజేపీ నేతలతో నిమ్మగడ్డ రహస్య భేటీ...

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ (ఫైల్ ఫోటో)

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ (ఫైల్ ఫోటో)

Nimmagadda Ramesh Kumar: నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఓ పార్టీ కోసం పని చేస్తున్నారని తాము చేస్తున్న వాదన నిజమని ఈ భేటీతో తేలిపోయిందని వైసీపీ ఆరోపించింది.

    ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో న్యాయపోరాటం చేస్తున్న ఆయన... బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ రహస్యంగా భేటీ అయినట్టు వీడియోలు బయటకు వచ్చాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఆయన ఈ నెల 13న జరిగిన భేటీలో సుమారు గంటసేపు చర్చించినట్టు తెలుస్తోంది. ఎన్నికల సంఘం వివాదం నడుస్తుండగా రహస్యంగా సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీలో టీడీపీ నేతలెవరూ పాల్గొనకపోయినప్పటికీ... చంద్రబాబుకు సన్నిహితులుగా వైసీపీ పదే పదే ఆరోపించే బీజేపీ నేతలు సుజనా చౌదరి, మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ కలిసి నిమ్మగడ్డను కలవడం హాట్ టాపిక్‌గా మారింది.

    మరోవైపు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఓ పార్టీ కోసం పని చేస్తున్నారని తాము చేస్తున్న వాదన నిజమని ఈ భేటీతో తేలిపోయిందని వైసీపీ ఆరోపించింది. బీజేపీలో ఉన్న చంద్రబాబు సన్నిహితులు, నిమ్మగడ్డ కలిసి కుట్ర చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండాల్సిన వ్యక్తి... ఈ రకమైన సమావేశాలకు ఎలా వెళతారని ఆయన ప్రశ్నించారు. దీనిపై టీడీపీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.




    First published:

    Tags: Andhra Pradesh, AP News, Nimmagadda Ramesh Kumar, Sujana Chowdary

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు