విశాఖలో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్.. డబ్బుల కోసం ఇంత నీచమా..?

విశాఖలో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్.. డబ్బుల కోసం ఇంత నీచమా..?

ప్రతీకాత్మక చిత్రం

నేవీ అధికారుల ఖాతాల్లో ఇమ్రాన్ డబ్బులు జమచేశాడన్న సమాచారంతో అతడి ఇంటిపై ఎన్ఏఐ దాడులు చేసింది. పలు డిజిటల్ పరికరాలతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

  • Share this:
    డబ్బుల కోసం పాకిస్తాన్‌కు కొమ్ముకాస్తున్న ఓ భారతీయుడిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తూ నేవీ రహస్యాలను చేరవేస్తున్న వ్యక్తిని సోమవారం విశాఖపట్టణంలో అదుపులోకి తీసుకున్నారు. NIA ప్రకటన ప్రకారం.. గుజరాత్‌లోని గోద్రా జిల్లా పంచమహల్‌కు చెందిన గిటేలి ఇమ్రాన్‌ను పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తున్నాడు. పాకిస్తాన్ ఏజెంట్ల సాయంతో నేవీ అధికారుల ఖాతాల్లోకి డబ్బులు జమచేస్తూ.. నేవీ రహస్యాలను శత్రుదేశానికి చేరవేస్తున్నాడు. భారత్ పలువురిని గూఢచారులుగా నియమించినట్లు సమాచారం అందటంతో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ.. సోమవారం విశాఖలో ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసి విచారిస్తోంది.

    ఇది అంతర్జాతీయ గూఢచర్య ముఠాకు సంబంధించిన కేసు అని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. కొందరు భారత నేవీ అధికారులు ఫేస్ బుక్, వాట్సప్ ద్వారా పాకిస్తాన్ ఏజెంట్లతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. భారత యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లు ఉన్న ప్రదేశాలు, వాటి కదలికలను పాకిస్తాన్‌కు చేరవేస్తున్నారని.. అందుకోసం భారత్‌లో ఉన్న ఐఎస్ఐ సహచరులు నేవీ అధికారుల ఖాతాల్లోకి డబ్బులు జమచేస్తున్నారని చెప్పారు. నేవీ అధికారుల ఖాతాల్లో ఇమ్రాన్ డబ్బులు జమచేశాడన్న సమాచారంతో అతడి ఇంటిపై ఎన్ఏఐ దాడులు చేసింది. పలు డిజిటల్ పరికరాలతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అతడి విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటకొచ్చే అవకాశముంది.

    Published by:Shiva Kumar Addula
    First published: