తిరుమల దర్శన నిబంధనలపై ఎన్‌హెచ్‌ఆర్సీ కీలక ఆదేశాలు..

తిరుమల ఆలయం

2005 సంవత్సరంలో అప్పటి టీటీడీ పాలకమండలి లఘుదర్శనం, శీఘ్ర దర్శనం, బ్రేక్‌ దర్శనాల విధానాన్ని ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా అమలుపర్చడం ప్రారంభించడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.

  • Share this:
    తిరుమలలో ఆగమశాస్త్ర పద్ధతులకు విరుద్ధంగా దర్శన నిబంధనలను మార్చి భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చేసిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ స్పందించిందని వనపర్తి జిల్లా ఆత్మకూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వై.తిప్పారెడ్డి తెలిపారు. 2005 సంవత్సరంలో అప్పటి టీటీడీ పాలకమండలి లఘుదర్శనం, శీఘ్ర దర్శనం, బ్రేక్‌ దర్శనాల విధానాన్ని ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా అమలుపర్చడం ప్రారంభించడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఇది దేవాదాయశాఖ చట్టం 142 ప్రకారం సమ్మతం కాదని ఈ నెల 3న ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశానన్నారు. ఈ ఫిర్యాదును 14వ తేదీన ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ విచారణకు స్వీకరించారన్నారు.

    తిరుమల దర్శన విధానాల్లో మార్పులపై ప్రభుత్వ వైఖరి, తీసుకోనున్న చర్యలపై ఎనిమిది వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఈ నెల 16న‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారని తిప్పారెడ్డి తెలిపారు. ఇదిలావుంటే.. శ్రీవారి ఆలయంలో కరోనా కలకలం సృష్టించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో 140 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఇందులో 15 మంది అర్చకులకు కరోనా వైరస్ సోకడంతో మిగతా అర్చకుల్లో ఆందోళన మొదలయ్యింది.
    Published by:Narsimha Badhini
    First published: