హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Rain Alert: ఏపీకి మరోసారి ఆరెంజ్ అలర్ట్.. రేపు ఎల్లుండి పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

Rain Alert: ఏపీకి మరోసారి ఆరెంజ్ అలర్ట్.. రేపు ఎల్లుండి పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా అధికారులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. మరో రెండు రోజుల పాటు మత్స్యకారులు.. లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..

ఇంకా చదవండి ...

ఏపీని ఈ ఏడాది వానలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో కోస్తాంధ్రలో ఈ రోజు విస్తారంగా వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీవర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే కోస్తాంధ్రలో రేపు అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని.. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవాకశం ఉందని వాతవారణ శాఖ స్పష్టం చేసింది. అలాగే తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కీ.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చిరిస్తున్నారు. ప్రస్తుతం సముద్రం అలజడిగా ఉందని.. మత్స్యకారులు శనివారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని ఐఎండి సూచించింది. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఐఎండి సూచనల ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఇవాళ, రేపు, ఎల్లుండి విస్తారంగా వర్షాలతో పాటు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీవర్షాలు కురుస్తాయని చెప్పారు. కోస్తాంధ్రలో రేపు అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నట్లు తెలిపారు. తీరం వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని అన్నారు.

ఇదీ చదవండి: ప్రియురాలు లేని జీవితం వద్దనుకున్నాడు.. ప్రేమించిన ఆమె కోసం ప్రాణత్యాగం చేశాడు

రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి.  జూరాల, శ్రీశైలం, నాగార్జుసాగర్‌ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. సంగమేశ్వర ఆలయంలోకి భారీగా వరద నీరు వచ్చింది. దీంతో సంగమేశ్వర ఆలయంలో వరద జలాలు శివలింగాన్ని తాకాయి.

ఇదీ చదవండి: ఆ జిల్లాల్లో మళ్లీ లాక్ డౌన్.. పెరుగుతున్న కంటైన్మెంట్ జోన్లు..? ఎక్కడెక్కడంటే..?

First published:

Tags: Andhra Pradesh, AP News, Heavy Rains, IMD, Vizag, Weather report

ఉత్తమ కథలు