Home /News /andhra-pradesh /

NEXT 3 DAYS HEAVY RAINS IN ANDHRA PRADESH ALL WATER PROJECTS ARE FULL NGS

Heavy Rains: మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ప్రాజెక్టులకు జలకళ

తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణలో భారీ వర్షాలు

Heavy Rains in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు అన్నీ జలకళ సంతరించుకున్నాయి.

    Weather Forecast: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో రాష్ట్రవ్యాప్తంగా నేడు,రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని అమరావతి (Amaravathi)వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తుల మధ్య కొనసాగుతూ, ఎత్తుకు వెళ్ళే కొద్ది నైరుతి దిశవైపు వంగి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రాగల 12 గంటల్లో ఒడిస్సా తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. ఉపరితల ద్రోణి తెలంగాణ (Telangna) నుండి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్రమట్టానికి 1.5 km నుండి 5.8 km ఎత్తుల మధ్య ఏర్పడింది. దీంతో రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రాలో కూడా రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

    ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాల పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాయలసీమలో కూడా రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉందని తెలిపింది.

    ఇదీ చదవండిచంద్రబాబు, అయ్యన్నలపై రోజా సంచలన వ్యాఖ్యలు.. టీటీడీ చైర్మన్ తో భేటీకి కారణం ఇదే

    ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల ప్రజలు భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో వచ్చే రెండు మూడు రోజులు మేఘావృతమై వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములుమెరుపులతోపాటు పిడుగులుపడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లోనూ వర్షాలతోపాటు చలిగాలులు వీయనున్నాయని తెలిపింది. ఉరుములుమెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది.

    ఇదీ చదవండి: ఆన్‌లైన్‌ సినిమా టికెట్ల అమ్మకంపై సోమవారం క్లారిటీ.. సీఎంతో భేటీకి పెద్దలు డుమ్మా..!

    శ్రీశైలం జలాశయ నీటిమట్టం వర్షాకాల సీజన్‌ పూర్తవుతున్న సమయంలో అనూహ్యంగా పెరగడంతో ఈ ఏడాది మూడోసారి శ్రీశైలం డ్యామ్‌ గేట్లు తెరిచారు (Srisailam Dam Gates Open). డ్యామ్‌ రెండు గేట్లను 10 అడుగుల మేరకు తెరిచి నీటి విడుదలను ప్రారంభించారు. జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో సాయంత్రానికి 5 గేట్లను 10 అడుగులకు తెరిచి నాగార్జునసాగర్‌కు 1,39,915 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

    ఇదీ చదవండి: ఏపీలో కర్ఫ్యూ మళ్లీ పొడిగింపు.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. పెళ్లిళ్లు.. పండుగలపై నిఘా

    రెండు జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ మరో 58,848 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 2,42,373 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యాక్‌ వాటర్‌ నుంచి హంద్రీ నీవా సుజల స్రవంతి, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. కుడిగట్టు కేంద్రంలో 13.381 మిలియన్‌ యునిట్లు, ఎడమ గట్టు కేంద్రంలో 16.200 మిలియన్‌¯ యునిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. జలాశయంలో 214.3637 టీఎంసీల నీరుంది. డ్యామ్‌ నీటిమట్టం 884.80 అడుగులకు చేరుకుంది.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Heavy Rains, WEATHER

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు