NEXT 2 DAYS HEAVY RAINS FOR ALL OVER ANDHRA PREST HEVY FLOODS TO SRISAILAM AND NAGARJUNASAGAR NGS
Heavy Rains: రెండు రోజులు భారీ వర్షాలు.. కృష్ణానదికి భారీ వరద.. మూడోసారి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
ఫ్రతీకాత్మక చిత్రం
Rain Alret: ఓ వైపు భారీ వానలు.. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మరోవైపు మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది..
AP Weather Report: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)వ్యాప్తంగా తక్కువ ఎత్తులో పశ్చిమ, నైరుతి గాలులు వీస్తున్నాయి. దీంతో శని, ఆదివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని అమరావతి (Amaravathi) వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు బలహీనపడడంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల ఎండ తీవ్రత కనిపించింది. పగటి ఉష్ణోగ్రతలు (Morning temperatures) సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఓ వైపు మధ్యాహ్నం భానుడు భగభగ అంటుంటే.. కాసేపటికే మళ్లీ వాతావరణం మారి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాలు తడిసిముద్దవుతున్నాయి. భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో కృష్ణమ్మ వేగంగా పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఈ నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. కృష్ణానది (Krishna River) పై ఉన్న బహుళార్ధసాధక ప్రాజెక్టు శ్రీశైలం 7 ఏడు గేట్లు 10 అడుగుల మేర ఎట్టి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం (Srisailam) జలాశయానికి 2,04,279 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుండగా.. 2,54,778 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులకు చేరింది. ఈ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీ (TMC)లు కాగా ప్రస్తుతం 214.3637 గా నీటి నిల్వ ఉంది.
శ్రీశైలం జలాశయ నీటిమట్టం వర్షాకాల సీజన్ పూర్తవుతున్న సమయంలో అనూహ్యంగా పెరగడంతో ఈ ఏడాది మూడోసారి శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరిచారు (Srisailam Dam Gates Open). డ్యామ్ రెండు గేట్లను 10 అడుగుల మేరకు తెరిచి నీటి విడుదలను ప్రారంభించారు. జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో సాయంత్రానికి 5 గేట్లను 10 అడుగులకు తెరిచి నాగార్జునసాగర్‌కు 1,39,915 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
రెండు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ మరో 58,848 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 2,42,373 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యాక్ వాటర్ నుంచి హంద్రీ నీవా సుజల స్రవంతి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. కుడిగట్టు కేంద్రంలో 13.381 మిలియన్ యునిట్లు, ఎడమ గట్టు కేంద్రంలో 16.200 మిలియన్¯ యునిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. జలాశయంలో 214.3637 టీఎంసీల నీరుంది. డ్యామ్ నీటిమట్టం 884.80 అడుగులకు చేరుకుంది.
శ్రీశైలం జలాశయం క్రస్ట్‌గేట్లు ఎత్తడంతో నాగర్జునసాగర్ (Nagarjuna Sagar) జలాశయ నీటిమట్టం 590 అడుగులతో గరిష్ట స్థాయికి చేరుకోనుంది. దీంతో ఇవాళ నాగార్జున సాగర్ ఆయకట్ట క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉందని డ్యామ్ అధికారులు తెలిపారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.