వైజాగ్ టు సికింద్రాబాద్.... స్పెషల్ ట్రైన్... ఎక్కండి మరి...

కొత్త సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలకు శుభవార్తలు అందుతున్నాయి. వాటిలో ఒకటి కొత్త రైలు. ఏపీలోని వైజాగ్ నుంచీ తెలంగాణలోని సికింద్రాబాద్‌కి ఇవాళ్టి నుంచీ కొత్త రైలు పరుగులు పెట్టబోతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: January 1, 2019, 7:58 AM IST
వైజాగ్ టు సికింద్రాబాద్.... స్పెషల్ ట్రైన్... ఎక్కండి మరి...
IRCTC-SBI Offer: రివార్డ్ పాయింట్స్‌తో రైలు టికెట్ కొనొచ్చు... ప్రాసెస్ ఇదే
  • Share this:
ప్రయాణికుల రద్దీ బాగా పెరగడంతో జనవరి ఒకటి నుంచి మార్చి 26 వరకు ప్రతి మంగళవారం విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు నడపబోతున్నట్లు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ మేనేజర్‌ జి.సునీల్‌కుమార్‌ తెలిపారు. నంబర్‌ 08501 రైలు ఇవాళ్టి నుంచి ప్రతి మంగళవారం రాత్రి 11 గంటలకు విశాఖలో బయల్దేరి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నంబర్‌ 08502 రైలు బుధవారం సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి గురువారం తెల్లవారుజామున 4.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌, కాజీపేటల్లో ఆగుతాయి.

New weekly train between vizag and secunderabad from today onwards
ట్రైన్ (ఫైల్ ఫొటో)


సంక్రాంతి ఆ తర్వాత వచ్చే పండుగలతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడు నెలలూ సందడి వాతావరణమే. దానికి తోడు ఎన్నికలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున కార్యకర్తల్ని వేర్వేరు జిల్లాలకు తరలిస్తాయి రాజకీయ పార్టీలు. అందుకోసం సామాన్య ప్రజలు ఎంచుకునే రవాణా మార్గం రైళ్లే కదా. అందుకే రైల్వే శాఖ ఇలాంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకొని కొత్త వీక్లీ రైలును ప్రవేశపెట్టింది. ఇదివరకు బడ్జెట్‌లో చెప్పినా, కొత్త రైళ్లు వచ్చేవి కావు. ఇప్పుడు రద్దీని క్యాష్ చేసుకునేందుకు ఉన్నతాధికారులే కొత్త రైళ్లు పట్టాలెక్కేలా చేస్తున్నారు. కొత్త సంవత్సరం వేళ మంచి వార్తే.

ఇవి కూడా చదవండి:


వామ్మో... ఛాన్స్ దొరికితే అవే చూస్తున్నారు


#HappyNewYear: సెలబ్రిటీస్ న్యూ ఇయర్‌ విషెస్


మగబిడ్డ కోసం తల్లిని చంపేశారు

Published by: Krishna Kumar N
First published: January 1, 2019, 7:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading