విజయవాడ భవాని స్టోరీలో ట్విస్ట్... కేసు పెడతానన్న పెంపుడు తల్లి

.సోదరుడి వెంట స్కూల్‌కి వెళ్లి భవానీ తప్పిపోయింది. ఆ తరువాత ఆమె కోసం ఎన్నో ఏళ్లుగా వెతికినా ప్రయోజనం లేకపోయింది

news18-telugu
Updated: December 8, 2019, 12:49 PM IST
విజయవాడ భవాని స్టోరీలో ట్విస్ట్... కేసు పెడతానన్న పెంపుడు తల్లి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
శ్రీకాకుళం చీపురుపల్లిలో దాదాపు 15 ఏళ్ల కిందట భవానీ అనే అమ్మాయి అదృశ్యమైంది. అయితే ఇప్పుడు తాజాగా ఆమె తల్లిదండ్రుల్ని, అన్నల్ని కలుసుకుంది. ఏళ్ల తర్వాత కలిసిన తనకుటుంబాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది. అటు భవానీ కుటుంబసభ్యులు కూడా కంటతడి పెట్టుకున్నారు. సోదరుడి వెంట స్కూల్‌కి వెళ్లి భవానీ తప్పిపోయింది. ఆ తరువాత ఆమె కోసం ఎన్నో ఏళ్లుగా వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆ తల్లిదండ్రులు కూతురిపై ఆశలు వదులకున్నారు.

అయితే భవానీ గురించి తెలుసుకున్న పటమటలంకకు చెందిన మోహన్ వంశీ అనే వ్యక్తి… భవానీని ఆమె కుటుంబసభ్యులకు పరిచయం చేశాడు. తన ఇంట్లో పని చేసేందుకు వచ్చిన భవాని గతం గురించి తెలుసుకున్న వంశీ, భవాని చెప్పిన ఆధారాలతో సంబంధిత వ్యక్తుల కోసం ఫేస్‌బుక్‌లో వెతికాడు. అలా భవానీ తల్లిదండ్రుల్ని కనిపెట్టి చివరకు అదర్నీ ఏకం చేశాడు. అయితే ఇంతవరకు అంతా సాఫీగా సాగినా... ఇక్కడే స్టోరీలో అసలు ట్విస్ట్ వచ్చింది. భవానిని పెంచిన తల్లి జయమ్మ తల్లిదండ్రులకు ఇచ్చేందుకు ససేమిరా అంటుంది. వచ్చినవాళ్లే భవానీ కన్నతల్లిదండ్రులు అనడానికి గ్యారంటీ ఏంటి అని ప్రశ్నిస్తుంది. దీనిపై పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా పెడతానంది జయమ్మ. అంతేకాదు డీఎన్‌ఏ టెస్ట్ చేయించాకే.. భవానీని వారికి అప్పగిస్తానని తెలిపింది.First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>